e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home ఎడిట్‌ పేజీ నాడు ఉద్యమగతి, నేడు అభ్యున్నతి

నాడు ఉద్యమగతి, నేడు అభ్యున్నతి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీలో గడప గడప తిరిగారు నాటి ఉద్యమ రథసారథి కేసీఆర్‌. అదే పద్ధతిలో నేడు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో నిధుల కేటాయింపు గురించి ఫెడరల్‌ స్ఫూర్తితో చర్చిస్తున్నారు. ఏడేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దిన దిన
ప్రవర్థమానంగా సాగుతున్నది. నూతన రాష్ట్రం ఎవరూ ఊహించని రీతిలోదేశానికే దిక్సూచిగా నిలుస్తున్నది. తద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌దార్శనికత రాజకీయ విమర్శకులను సైతం అబ్బురపరుస్తున్నది.

నాడు ఉద్యమకారుడిగా నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఏ నిర్ణ యం తీసుకున్నా అది తెలంగాణ కేంద్రంగానే ఉంటుందని చరిత్ర నిరూపిస్తున్నది. తెలంగాణ విముక్తి కోసం 2001లో పార్టీని స్థాపించి సాగించిన ఒంటరి పోరాటం తెలంగాణ ప్రజల ఆదరణను పొందడమే కాకుండా వారిని కేసీఆర్‌ వెన్నంటి నడిచేలా విశ్వాసాన్ని పాదుకొల్పింది. టీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌లో తెలంగాణ భవన్‌ను నిర్మించి ఉద్యమానికి కేం ద్రం చేసింది. ఆ తర్వాత పార్లమెంటరీ పంథాను తెలంగాణ సాధనకు విప్లవాత్మక కార్యాచరణగా మార్చిన ఘనత కేసీఆర్‌దే. ఓటును ప్రజాకాంక్షలకు ప్రతిరూపంగా నిలిపిన చరిత టీఆర్‌ఎస్‌దే. కేసీఆర్‌ దార్శనికతతో టీఆర్‌ఎస్‌ ఉద్యమ పార్టీగా తెలంగాణను సాధించింది.

- Advertisement -

ప్రజాదరణ పొందడం ద్వారా టీఆర్‌ఎస్‌ అనతికాలంలోనే తెలంగాణ గర్వించే దిశగా సాగుతున్నది. సబ్బండ వర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సుపరిపాలనను అందిస్తున్నది. ఇటువంటి చారిత్రక నేపథ్యంలో తెలంగాణకు మాత్రమే పరిమితమై ఉన్న టీఆర్‌ఎస్‌ రాజకీయంగా దేశానికి పరిచయం కావాల్సి ఉన్నది. తన పాలనా ఒరవడిని ప్రతిబింబించేందుకు ఢిల్లీని కూడా కేంద్రంగా మార్చుకుంటున్నది. ఢిల్లీలోని వసంత్‌ విహార్‌ కేంద్రంగా తెలంగాణ భవన్‌ నుంచి సుపరిపాలనా వసంతాలను పం చనున్నది. సబ్బండవర్గాల ఆకాంక్షలను దేశానికి వివరించేందుకు, దేశ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించేందుకు వసంత్‌ విహార్‌లో కార్యాలయానికి పునాది వేసుకున్నది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేతగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ద్విముఖ బాధ్యతలను సమర్థంగా నడిపిస్తున్న కేసీఆర్‌ నేడు దేశ ఫెడరల్‌ వ్యవస్థకు చుక్కానిగా నిలిచినారనటంలో సందేహం లేదు.

దేశ రాజధానిలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాల యం తెలంగాణ భవన్‌ నిర్మాణానికి భూమిపూజ సందర్భంగా ఢిల్లీ పురవీధులన్నీ గులాబీ మయమయ్యాయి. జై తెలంగా ణ నినాదాలతో ఢిల్లీ మార్మో గింది. దీంతో జాతీయ మీడియాలో చర్చ ప్రారంభమైంది. ఇటు పార్టీ కార్యాలయ ఏర్పా టు, అటు ప్రధాని సహా కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరుగుతుండటం ఆశ్చర్యచకితులను చేస్తున్నది.
ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశమవ్వడం, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చించడాన్ని కొందరు విమర్శించడం ఫెడరల్‌ ప్రజాస్వామిక స్పూర్తిపై వారి అవగాహనా రాహిత్యమే. రాజకీయాలు, పాలనావ్యవహారాలు కలెగలిసి ఉండవచ్చు. వాటిని నీరు, పాలు లాగా విడదీసి చూడాల్సిన అవసరం ఉన్నది. రెంటినీ ఒకే గాటన కట్టి హ్రస్వ దృష్టితో చూడటం అపరిపక్వతనమే. అయినదానికి, కానిదానికి కేంద్రం తో కయ్యానికి దిగడం తెలంగాణకు నష్టమే తప్ప లాభం కాదు. నాడు ఎట్లయితే రాష్ట్ర సాధన కోసం అనేక పార్టీల గడపగడపకూ తిరిగి మద్దతు కూడగట్టారో, ఇప్పుడు అదే విధంగా ఢిల్లీలో మకాం వేసి విభజన హామీల అమలుపై, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రధానితో కేసీఆర్‌ చర్చించారు. రాష్ర్టానికి రాజ్యాంగ హక్కుగా దక్కాల్సిన నిధుల వాటాను, కేటాయింపులను వివరించారు. కేం ద్ర పెద్దలతో సానుకూల నిర్ణయాన్ని రాబట్టడం ముదావహం.

తెలంగాణలో అమలుచేస్తున్న అభివృద్ధి, సం క్షేమ పథకాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రశంసలను అందుకొంటున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్బండవర్గాల అభ్యున్నతికి అమలుచేస్తున్న పథకాలను, ఇటీవలే ప్రవేశపెట్టిన దళిత బంధును దేశమంతా గమనిస్తున్నది. దేశ పరిపాలనా, రాజకీయరంగంలో ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా దేశానికే మార్గదర్శకునిగా కేసీఆర్‌ నిలిచారు. టీఆర్‌ఎస్‌ను ఆదర్శప్రాయమైన పార్టీగా మలిచారు.

(వ్యాసకర్త: సీఎం పీఆర్‌వో)
రమేశ్‌ హజారి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana