పసుపు ముద్ద తోడ
పార్వతి చేసింది !
మట్టితో గణపతి
మనము చేద్దాము
మట్టికున్న గంధం
విషపు రంగులకు లేదు!
మహిలోన దేవకళ
మట్టి గణపతికే మరి!
చిట్టి చేతులతో మట్టి
చిన్ని గణపతి అగును!
బాల గణపతి పేరుతో
బహు ప్రసిద్ధి చెందును!
అందరింటా నేడు
మట్టి గణపతికే పూజ!
మట్డితో చేసినదే
మహిమ గల గణపతి!
బండెడు మట్టితో
బండి నిండారా గణపతులు!
బహు రూపాలతో
భళి భళి వినాయక దర్శనం!
రండి! మాతోని కలవండి
మట్టిని తడపండి!
రెండు చేతుల తోడ కుదురుగా
నిష్టగా ఇష్టముగ గణపతిని చేయండి!
వాడ వాడ ఇదిగో
గణపతుల జాతర!
కాలుష్యం లేక లోకానికీ మేలు
గణపతిని చేసిన చేతులే ధన్యము!
కందాళై రాఘవాచార్య
8790593638