అణగారిన వర్గాలుండొద్దు
అనుబంధ వర్గాలే మన హద్దు
అందుకు సోపానమవ్వాలి
అందరి బంధువై దళితబంధు!
బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలె
ఆరారు కాలాలు అందరి బాగును కోరాలె
అందుకు అద్దం పట్టాలె దళితబంధు
అందుకు సాక్ష్యం అవ్వాలె అందరి ముందు!
దరిద్రాన్ని పోగొట్టే దీనుల బంధువవ్వాలె
ప్రభుత్వం చెప్పిన మాటలు నిజమవ్వగా
అన్నివర్గాలకు ఆపన్న హస్తంగా మారాలె
ఆదెరువై అన్నికాలాల్లో విరాజిల్లాలె!
కటికదారిద్య్రపు కోరలను అణచగా
కనక శకము ఆరంభమవ్వాలే
కడుపేదల బాధలు కనుమరుగై
కడుపునిండా కలలు పండాలె!
కోటి ఎకరాల మాగాణి.. పచ్చగ కలకల లాడగా
కొత్త ఆశలు చిగురించాలె.. సరికొత్త వసంతం మొదలవ్వాలె!
దళిత బంధువు కాదది ధైర్యసంజీవని అని-
వేనోళ్లు పొగడాలె!
దళితబంధువు కాదది-
ఈ శతాబ్దపు దూరదృష్టి అని-
రాబోయే తరాలు తలువాలే!
రాబంధువులెందరి బాధలనుంచో
రక్షించే కవచమవ్వాలె దళితబంధు
రాబోయే కాలంలో
అందరి ఆకాంక్షలు నెరవేర్చె
అంకురమవ్వాలే దళితబంధు!!
అడప రాజు
7780618850