ఆబాల గోపాలమానందమొందగా
చేయెత్తి జైకొట్టు చెట్టు చేరి
అనుభవ విద్వత్తు, నద్భుతమై పారె
విద్యుదాకాశమై వెలిగెనిచట
హరితహారమ్ములు మురిపాల తోరణాల్
ప్రజలెల్ల పాల్గొన్న రాణకెక్కు
కరువు తెరువు మారు కలలెల్ల ఫలియించు
స్వచ్ఛత శుభ్రత వరలెనేని
ముందుచూపు ఘనుడు, మన ముఖ్యమంత్రి
కేసీఆర్ వినూత్నమౌ స్కీములిచ్చె
శతసహస్ర వసంతముల్ శాశ్వతముగ
నిలుచు బంగారు తెలంగాణ నిత్య శుభము
తల్లోజు యాదవాచార్యులు
99124 51319