e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home ఎడిట్‌ పేజీ సార్‌ అడుగులో అడుగు వేద్దాం!

సార్‌ అడుగులో అడుగు వేద్దాం!

దళితజాతిని జాగృతం చేస్తూ వారిని ఆర్థిక స్వావలంబన దిశగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ సమాజం అండగా నిలవాలి. అందులో దళిత సంఘాల నేతలు, మేధావులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు పూర్తి బాధ్యతతో ‘దళిత బంధు’ విజయానికికృషి చేయాలి. ఈ స్ఫూర్తి విజయ దశమి కల్లా హుజూరాబాద్‌లో విజయాన్నందించాలి.

2011 గణాంకాల ప్రకారం దేశంలో దాదాపు 25 కోట్ల మంది దళితులున్నారు. ఇందులో 95 శాతం మంది దయనీయ జీవనం సాగిస్తున్నారు. తెలంగాణలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం దాదాపు 17 లక్షల కుటుంబాలున్నాయి. ఇంకా 2 శాతం పెరిగే అవకాశం ఉన్నది. నాటి నుంచి నేటిదాకా దళితుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లున్నది.

- Advertisement -

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశంలో సామాజిక వివక్షతో పాటు ఆర్థికంగా చితికిపోయినవారు దళితులు మాత్రమే. 75 ఏండ్ల స్వతంత్ర భారతావని స్వర్ణోత్సవాలు జరుపుకొంటున్న తరుణంలో దళితులు ఇంకా అంటరానివారిగా చూడబడుతున్నారు. వివక్షతో వారిపై ఇంకా దాడులు జరుగుతుండటం గత పాలకుల వైఫల్యమే. కేసీఆర్‌ చెప్పినట్టు.. శరీరంలో ఒక భాగం పని చేయకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసు. అదే దేశ జనాభాలో గణనీయ సంఖ్యలో ఉన్న దళితజాతి అవమానకరమైనరీతిలో తీవ్రమైన వివక్షకు గురవుతుండటం విషాదం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ కల్పించిన రాజ్యాంగ ఫలాలు, రిజర్వేషన్లు దళితజాతికి కొంత ఊరటనిస్తున్నాయి. దేశ పాలకులు పూర్తిస్థాయిలో దళితోద్ధరణకు పాటుపడుతూ సామాజికంగా, ఆర్థికంగా నిలదొక్కుకునేలా వారిని ముందుకునడిపిస్తే ఈ స్థితి ఉండేది కాదు.

పాలకులు రాజ్యం కోసం రాజకీయ క్రీడలు చేస్తారే తప్ప దళితజాతి పట్ల, పేదల పట్ల నిబద్ధత చూపరు. పాలకుల చిత్తశుద్ధి లేమితోనే దళితులు ఇంకా అభివృద్ధికి దూరంగా ఉన్నారు. కాగా గత నలభై ఏండ్లుగా ప్రజా రాజకీయంలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ 25 ఏండ్ల కిందట సిద్దిపేట నియోజకవర్గంలో రామునిపట్ల గ్రామాన్ని దత్తత తీసుకొని ‘దళితజ్యోతి’ కార్యక్రమం చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. నాడు కేసీఆర్‌ మస్తిష్కంలో పురుడు పోసుకున్నదే నేటి ‘దళితబంధు’ పథకం. తెలంగాణ నుంచి దేశం నలుమూలల ఉన్న దళితజాతిని సామాజిక, ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు కదిలేటట్లు మహోద్యమానికి పిలుపునిచ్చారు కేసీఆర్‌. ఆ ఉద్యమానికి తెలంగాణ దళిత జాతి మార్గదర్శకం కానున్నది. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఆర్థిక వనరులు పెంచుతూ అన్నివర్గాల ప్రజల సంక్షేమంలో భాగంగా ప్రతి కుటుంబానికి చేయూ తనిస్తున్నారు. ఆసరా పింఛన్‌, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, అమ్మఒడి వంటి సంక్షేమ పథకాలతో పాటు 24 గంటల ఉచిత, నాణమైన విద్యుత్‌ అందిస్తున్నారు. ఇంటింటికి స్వచ్ఛమైన మిషన్‌ భగీరథ నీళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు, తాగునీరు అందిస్తూ చెప్పినవి, చెప్పనవి, అడిగినవి, అడగనివి ఎన్నో పథకాలు తెచ్చి తెలంగాణ సమాజాభివృద్ధికి కృషిచేస్తున్నారు. ప్రజల గుండెల్లో ఇంటికి పెద్ద కొడుకులా ఆసరాగా నిలిచారు మన కేసీఆర్‌. ఈ కోణంలోనే దళిత కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబనకు ‘దళిత బంధు’ బాటలు వేసింది.

2011 గణాంకాల ప్రకారం దేశంలో దాదాపు 25 కోట్ల మంది దళితులున్నారు. ఇందులో 95 శాతం మంది దయనీయ జీవనం సాగిస్తున్నారు. తెలంగాణలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం దాదాపు 17 లక్షల కుటుంబాలున్నాయి. ఇంకా 2 శాతం పెరిగే అవకాశం ఉన్నది. నాటి నుంచి నేటిదాకా దళితుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లున్నది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్నిటికన్నా వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు దళితజాతిలో వెలుగై ‘దళిత బంధు’ నిలుస్తున్నది.

ప్రజల పట్ల మమత, మానవీయతతో ప్రజల కోణంలో ఆలోచించి సీఎం కేసీఆర్‌ అడుగులు వేస్తున్నారు. దళితజాతి తరతరాల అణచివేత, వివక్షల నుంచి విముక్తి సాధించేందుకు కేసీఆర్‌ అండగా నిలుస్తున్నారు. మహాత్మాగాంధీ, అంబేద్కర్‌, పూలే సాంఘిక సంస్కరణోద్యమాల స్ఫూర్తితో కేసీఆర్‌ దళితుల అభ్యున్నతికి కంకణబద్ధులై పనిచేస్తున్నారు. ఇప్పుడు కావాల్సింది కేసీఆర్‌ అడుగులో అడుగేసి నడువటమే. అందరి విముక్తి దిశగా సాగిపోవటమే.
(వ్యాసకర్త: జర్నలిస్టు)

చిటుకుల మైసారెడ్డి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana