చెట్లు పెంచితె చెలిమి ఎదుగును
నీడపట్టున నీతి కురియును
పూలుపండ్లయి పుష్ఠికూర్చును
పరులహితవర దాయి వృక్షం!
చిట్టి మొక్కలు గట్లనాటగ
చెట్ల నెయ్యమె పాట్లు తరుమును
హాయినిచ్చెటి అమ్మ లాలన
తరువు పరువై ధనముకూర్చును!
ఇంటికొక్కటి యేమిలాభం
మనిషికొక్కటి మాను పెంచరా
హరిత రంగుల ప్రాణ వాయువు
ఇంటి ముందర యింపుగూర్చురా!
మానితంబుగ మనకు పూర్వులు
పెరటి తోటను పెంచిచూపిరి
నీతినడచియు నియమమెంచిరి
స్వార్థమన్నది వ్యర్థమనిరిల!
జలము సిరులే శక్తి కూర్చును
చెరువు కుంటలు కరువు దీర్చును
వాన వరదను వడసి పట్టుము
ఇంకుడు గుంతలె ఇగురమిచ్చును!
పంచభూతపు వాతవరణం
కల్మశాలకు కర్త ఎవరిల?
శ్రేయమెంచెడి స్నేహితుడవై
మేలు కూర్చర మేధినందున!
డాక్టర్ పాండాల ,మహేశ్వర్
99121 80054