మన చరిత్రకు సింహాసనం


Tue,March 12, 2019 08:12 PM

Rachakondaతెలంగాణ చరిత్రను ఇప్పుడిప్పుడే మన దృష్టి తో చూడటం, మన ఆత్మతో రాయడం మొదలుపెట్టాం. ఈ నేలను పాలించిన మన పాలకుల జీవిత విశేషాలు, వంశవృక్షాలు, పాలనా విధానాలతో పాటు నాటి సాంస్కృతిక సౌరభాలను మనకన్నా ఎక్కువ హృద్యంగా ఎవరు రాయగలరు? ఈ క్రమంలోనే రచయిత నగేష్ బీరెడ్డి తాజా చారిత్రక రచనలు ప్రస్తావనకు వస్తున్నాయి. నమస్తే తెలంగాణ ఆదివారం అనుబంధం బతుకమ్మలో తొంభై వారాల పాటు ఆయన రాసిన వ్యాసాలు తెలంగాణ చరిత్ర రచయితల గురుతర బాధ్యతను మరోసారి గుర్తుచేశాయి. చరిత్ర సాహిత్య రచనల పరంగా ప్రస్తుత చారిత్రక అవసరాన్ని ఇవి చక్కగా, హుందాగా నొక్కిచెప్పాయి.


2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతి నుంచి జరుగుతున్న అద్భుత కార్యక్రమాల్లో మన సాహిత్య సాం స్కృతిక రంగాలకు, ప్రత్యేకించి చరిత్ర రచనలకు లభిస్తున్న గౌరవం ఎనలేనిది. పై వ్యాసాల్లో 26 వ్యాసాలను ప్రభు త్వం తరఫున భాషా సాంస్కృతిక శాఖ కాకతీయ ప్రస్థా నం పేరుతో పుస్తక రూపంలోకి తెచ్చింది. ఇప్పుడు రాచకొండ: పద్మనాయకులు, సంస్థానాలు శీర్షికన కాకతి పబ్లికేషన్స్ వారు అందులోని మరో 29 భాగాలను పుస్తకంగా ప్రచురించారు. ఇక, ప్రత్యేకించి తెలంగాణలోని మన సం స్థానాలపై మరొక అపురూప పుస్తకం రూపుదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వ ఆధ్వర్యంలో, మనదైన చరిత్రను మన రచయితల కలాలలోంచి మనదైన ఆత్మీయ దృష్టితో రాయడంలో, వాటిని చదువుకోవడంలో ఉన్నంత ఆనందం మరెందులోనూ లభించదు. ఈ ఘనత కచ్చితంగా మన ప్రభుత్వానిదే. అందుకే, మన చరిత్రకు మన ప్రభుత్వం అగ్ర సింహాసనం వేసిందనడం.

చరిత్ర పేరు చెబితేనే చాలామందికి స్కూలు జీవితంలోని సాంఘికశాస్త్ర పాఠాలు గుర్తుకువస్తాయి. ఎంత చదివినా ఇంకెంతో మిగిలి ఉన్నట్టు, పరీక్షల్లో ఎన్ని పేజీలు నింపినా తక్కువే అయినట్టు, రాజులు, చక్రవర్తులు, యుద్ధాలు, పాలనావిధానాలు, ఏది ఎవరి శకం, ఎవరు ఎవరిని ఎప్పు డు ఓడించారు? ఆయా సంవత్సరాలు, వారి పేర్లు.. మొత్తంగా ఇదొక అఖాతం. నగేష్ బీరెడ్డి నిజానికి ఒక సైన్స్ విద్యార్థి అయినా, కొన్ని వందల సంవత్సరాల తెలంగాణ చరిత్రను నేటి పాఠకులకు సరళతరమైన శైలిలో అందించే బాధ్యతను భుజానికెత్తుకోవడమే ఆశ్చర్యకరం.


నిన్నటి కాకతీయ ప్రస్థానం పుస్తక ప్రచురణ, అందులోని చారిత్రక సంపద ఒక అద్భుతమనుకుంటే, ఇప్పటి రాచకొండ పుస్తకాన్ని ఈ రచయిత పాఠకులకు అందించడం మరొక విశేషం. ఒక పుస్తకానికి ఆడియో, వీడియో ప్రోమోలు, షూటింగ్, రికార్డింగ్‌లు జరిపి, ట్రైలర్లు, లఘుచిత్రాలను రూపొందించి, సామాజిక మాధ్యమం ద్వారా తెలుగు ప్రేక్షక పాఠకులకు అందించేవారు ఈ రోజుల్లో ఎవరున్నారు? భావిభారత పిల్లలకే తొలి ప్రతులను అందించే రచయితలు మనకెక్కడైనా కనిపిస్తారా? ఇది చరిత్ర పుస్తకమా, ఇంత బాగానా అని ఆశ్చర్యం కలిగించేంత చక్కద నం అది. వాణిజ్య లాభాలకు అతీతంగా మనదైన చరిత్రను ఇంతలా భుజానేసుకొనే వారు చాలా అరుదు. మన చరిత్ర పట్ల, తన రచనల పట్ల ఈ రచయితకు ఎంతగా ప్రేమ, ఆసక్తి ఉన్నాయో దీన్నిబట్టి స్పష్టమవుతున్నది.

మన తెలంగాణ చరిత్ర మనది కాకుండాపోయిన నేపథ్యంలో చరిత్ర రచనల ద్వారా ఇటు నమస్తే తెలంగాణ పత్రిక, అటు ఈ రచయిత తమదైన సామాజిక బాధ్యతను నెరవేర్చారు. విస్తృత లక్ష్యంతో చూసినప్పుడు ఈ రెండు పుస్తకాలు, రాబోయే మరొక పుస్తకం మనదైన సమగ్ర చరిత్ర కాకపోవచ్చు. కానీ, ఒక బృహత్ పనికి ఇదొక ఆరం భం. తెలంగాణ బృహత్ చరిత్ర అంతా, నాటి ప్రజాజీవితాలు, సాంస్కృతిక వైభవమంతా ఒక సంపూర్ణ విజ్ఞాన సర్వస్వం స్థాయిలో గ్రంథస్థం కావలసి ఉన్నది. ఈ యజ్ఞాన్ని ఎవరు, ఎప్పుడు, ఎలా నిర్వర్తించినా అది ఆదర్శనీయమే అవుతుంది.

చరిత్ర పేరు చెబితేనే చాలామందికి స్కూలు జీవితంలో ని సాంఘికశాస్త్ర పాఠాలు గుర్తుకువస్తాయి. ఎంత చదివినా ఇంకెంతో మిగిలి ఉన్నట్టు, పరీక్షల్లో ఎన్ని పేజీలు నింపినా తక్కువే అయినట్టు, రాజులు, చక్రవర్తులు, యుద్ధాలు, పాలనావిధానాలు, ఏది ఎవరి శకం, ఎవరు ఎవరిని ఎప్పు డు ఓడించారు? ఆయా సంవత్సరాలు, వారి పేర్లు.. మొత్తంగా ఇదొక అఖాతం. నగేష్ బీరెడ్డి నిజానికి ఒక సైన్స్ విద్యార్థి అయినా, కొన్ని వందల సంవత్సరాల తెలంగాణ చరిత్రను నేటి పాఠకులకు సరళతరమైన శైలిలో అందించే బాధ్యతను భుజానికెత్తుకోవడమే ఆశ్చర్యకరం.

నాణ్యమైన న్యూస్‌ప్రింట్, అందమైన ఫాంట్స్, ఆకట్టుకు నే డిజైన్, దృఢమైన బైండింగ్, సౌకర్యవంతమైన, సహేతుకమైన ధరతో రాచకొండ పుస్తకం ఆ కోట గౌరవానికి తగ్గట్టుగానే ఉన్నది. చరిత్ర విద్యార్థులు, అభిమానులనే కాదు, సామాన్య పాఠకులను సైతం వదులకుండా చదివిస్తుంది. శీర్షికల నుంచి వాక్య నిర్మాణాల వరకు, చెప్పేదేదైనా సరళంగా, ఆకట్టుకునే విధంగా అందించారు. రాచకొండ పద్మనాయకుల చరిత్రపై రచయిత ఒక కొత్తచూపును ప్రసరింపజేశారు. మరిన్ని చారిత్రక వివరాలు, ఆధారాలతో కొత్తగా, హృద్యంగా, కమనీయంగా వివరించారు. పద్మనాయకుల ను వర్ణించిన తీరు, పాత్రలను నడిపించిన విధానం ఆయన రచనా మనకు రుచి చూపిస్తుంది అని నమస్తే తెలంగాణ సంపాదకులు కట్టా శేఖర్‌రెడ్డి తన ముందుమాట (కొత్తచూపు)లో పేర్కొన్నది అక్షరసత్యం. తాను చరిత్రను కేవలం తిరిగి రాస్తున్నానని, పూర్తి ప్రేమతోనే అక్షరబద్ధం చేశానని చెబుతూనే రచయిత నగేష్ నిజాయితీగా సద్విమర్శలను స్వాగతించారు.

ఇందులోని రెండు అధ్యాయాలలో మొత్తం 29 వ్యాసాలను పొందుపరుచగా, తొలి భాగంలో రేచర్ల పద్మనాయకు లు, రెండో భాగంలో పద్మనాయకుల (వెలమ వారు) సం స్థానాల విశేషాలున్నాయి. కాకతీయుల తర్వాత ఏం జరిగింది? నుంచి మొదలుపెట్టి వెలమ రాజుల పుట్టుపూర్వోత్తరాలన్నీ (అందుబాటులో ఉన్నంతమేరకు) అందించారు. బొబ్బిలి, వెంకటగిరి, జటప్రోలుల నుంచి వారి పలు సం స్థానాల వివరాలనూ విస్తృతంగా చేర్చారు. రాస్తున్నది చరి త్ర కాబట్టి, ప్రామాణికమైనవే తప్ప ఎక్కడా మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నాలు జరుగకపోవడం అభినందనీయం. ఆయా సందర్భాలను, చరిత్రకారులను గుర్తుకుతెచ్చే ఛాయాచిత్రాలు పుస్తకానికి అదనపు ఆకర్షణ.

-దోర్బల బాలశేఖరశర్మ, 8096677410
(రాచకొండ: పద్మనాయకులు, సంస్థానాలు,
రచన: నగేష్ బీరెడ్డి, ప్రచురణ: కాకతి పబ్లికేషన్స్,
పేజీలు: 130, వెల: రూ. 120/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో,
ప్లాట్ నంబర్: 151, రోడ్ నం: 16, భవానీ నగర్,
మన్సూరాబాద్, ఎల్‌బి నగర్, హైదరాబాద్-68.
రచయిత సెల్: 80966 77177)


ORDER YOUR COPY
పుస్తకం ఎలా పొందాలంటే?
8096677177 కు మీ పూర్తి చిరునామా పోస్ట్ చేయండి..
ఎన్ని కాపీలో కూడా చెప్పండి..
పుస్తకం ధర : 120
పోస్టల్ చార్జీలు : 30
మొత్తం : 150 చెల్లించగలరు.
8096677177కి
గూగుల్ పే ద్వారా గానీ, పేటియం ద్వారా గాని చెల్లించొచ్చు.
గూగుల్ పే, పేటియం లేని వారు..
B Nageshwar Reddy
Bank : State Bank of India
Ac no : 30742837768
Isbn : SBIN0011667
ఈ అకౌంట్ కు మనీ ట్రాన్స్ఫర్ చేసి తెలియజేయండి.

1537
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles