అత్యాధునిక కవితా సంచలనాలు


Mon,March 11, 2019 12:43 AM

1941లో అతివాస్తవికత పేరుతో కవిత రాసిన మొదటి తెలంగాణ కవి బూర్గుల రంనాథరావు. అతివాస్తవికత మ్యానిఫెస్టో అన్నదగ్గ కవిత ఇది. హేతువు పేరు తో సంప్రదాయాల తిరస్కరణ అప్పటివరకు పరంపరగతాను గణంగా వచ్చి న మార్పుల స్థానే కొత్త వైరుధ్యాల వచ్చాయి. అప్పటివరకు కొనసాగిన ధర్మనిరతి, దైవం, మతం వంటి విశ్వాసాలతో కొనసాగిన మనిషి జీవితంలో అన్నిటిపై అవిశ్వాసం ప్రవేశించింది. ఆంగ్ల విద్య, హేతువు, శాస్త్ర విజ్ఞానం ఆధునిక విద్యావంతున్ని ఏకాకిని చేసి అశాంతియుతునిగా మార్చింది.


తెలంగాణలో సంఘసంస్కరణ, జాతీయోద్యమ, భావకవిత, ప్రగతిశీల కవితా ఉద్యమాల గురించి ఈ మధ్య వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిం దే. ఐరోపా వికాస ఉద్యమకాలం నుంచి అఖం డంతో సంబంధాల్లో ఉన్న మహానగరం హైదరాబాద్. ఏమైనా ఆ భావవ్యాప్తికి హద్దుల్లేవు. దేశంలో అన్ని రాష్టాల్లో వచ్చినట్టే సంఘసంస్కరణ, జాతీయోద్యమ, ప్రగతిశీల కవిత వంటివి యూరప్ ప్రభావంతో వచ్చినట్లుగానే, అక్కడి సమాజాలను ఎంతగానో ప్రభావితం చేసిన డాడాయిజం, అధివాస్తవికత, రూపవాదం, ప్రతీకవాదం హైదరాబాద్ మహానగరం ఉన్న తెలంగాణలో వచ్చాయి. కానీ పారిశ్రామిక నాగరికతకు, నగరజీవితానికి తార్కాణమైన వ్యక్తులు, వారి మానసిక కల్లోలం, సమాజంతో తమ వ్యక్తిగత స్థాయిలో జరిపే సంఘర్షణకు సం బంధించి కవితా వ్యక్తీకరణకు సూచికైన డాడాయిజం, అధివాస్తవికత (సర్రియలిజం), రూపవాదం (ఫార్మలిజం) రాలేదని బలమైన వాదం తెలంగాణపై ఉన్నది.

గతశతాబ్ది రెండవ దశకం నుంచి పదునెక్కిన వైరుధ్యాల వల్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిల నుంచి హైదరాబాద్ రాజ్యం లో భాగమైన తెలంగాణ కూడా 1920ల నుంచి అనేకానేక కవితా ఉద్యమాలకు పందిరిగా పరిఢవిల్లింది. అందులో భాగమే డాడాయిజం, అధివాస్తవికత (సర్రిలియజం), రూపవాదం, ప్రతీక వాదం, ప్రగతిశీలత వంటి కవితా పాయలు. సంస్కరణ, జాతీయోద్యమ, భావకవితా ఉద్యమాలు ప్రవచించిన ఆశయాలను, ఆదర్శాల నీడలో ఆధునిక తెలంగాణ కవితారంగం ప్రగతిపథం, అతివాస్తవికత వంటి నవకవితా చేతనను అందిపుచ్చుకున్నది. రష్యన్ విప్లవ ప్రభావం వల్ల కావచ్చు నాటి తెలంగాణ కవులలో ఒకరైన మంత్రి ప్రగడ వేంకటేశ్వర్‌రావు సోషలిజాన్ని ప్రస్తావిస్తూ (1934) కవితా రచన చేశారు. అదే కాలాన నాటికి ప్రబలంగా భావకవితా ఉద్యమ భూమికను, ప్రతీకలను కాదనీ అణగారిన వర్గాల దుర్గతిని చిత్రిస్తూ సురవరం, గంగుల సాయిరెడ్డి, కాళోజీ, సన్నిధానం, బోయినపల్లి రంగారావు వంటివారు కవితా రచనకు పూనుకున్నారు. ఇదే కాలాన బలహీనపడిన భావకవితా రచనా సరళిని తిరస్కరిస్తూ జంఘాలుడు పేరుతో వ్యంగ్య కథ, భావకవి రామ్మూర్తి పేరుతో సురవరం రెండు కవితా రచనలు చేశారు. దీని తో గతశతాబ్ది మూడవ దశకపు ఆఖరున తెలంగాణ కవితారంగం తీవ్రమైన సంఘర్షణకు లోనైంది.

నాటికి అంతర్జాతీయ స్థాయిలో ఇంగ్లీషులో హైదరాబాద్ కేంద్రంగా వేళ్లూనుకున్న ఉర్దూ సాహిత్యం లో అప్పటికే తరక్కిపసంద్ పేరుతో ప్రగతిశీల కవితపై, లాషోరియత్ పేరుతో అధి వాస్తవికతలపై నిఘార్, పయావ్‌ు వంటి మన్నన పొందిన పత్రికలలో చర్చ మొదలైంది. జాతీయోద్యమ, ప్రగతిశీల భావాలకు కట్టుబడిన సీనియర్ కవులు సురవరం, కాళోజీ, వైతాళిక సమతి, కేసరీ సంఘంలో మరికొందరు సంఘటితమైతే అప్పుడప్పుడే తెలంగాణ కవితారంగంలోకి అడు గు యువకులు బూర్గుల రంనాథరావు, బాగీ నారాయణరావు, దేవులపల్లి రామానుజరావు, సీతారామయ్యభట్టర్, నెల్లూరి కేశవస్వామి సాధనసమితి పేరుతో ఒకవైపు మోహరించడం మొద లైంది. వీరే అతివాస్తవికత పట్ల మొగ్గుచూపారు. దేవులపల్లి, భట్టర్‌లు ఆ తాత్వికతను విమర్శించడంతో అదే యువకవులకు ఆకర్షణీయంగా కనిపించింది. 1941లో అతివాస్తవికత పేరుతో కవిత రాసిన మొదటి తెలంగాణ కవి బూర్గుల రంనాథరావు. అతివాస్తవికత మ్యానిఫెస్టో అన్నదగ్గ కవిత ఇది. హేతువు పేరు తో సంప్రదాయాల తిరస్కరణ అప్పటివరకు పరంపరగతాను గణంగా వచ్చి న మార్పుల స్థానే కొత్త వైరుధ్యాల వచ్చాయి.

అప్పటివరకు కొనసాగిన ధర్మనిరతి, దైవం, మతం వంటి విశ్వాసాలతో కొనసాగిన మనిషి జీవితంలో అన్నిటిపై అవిశ్వాసం ప్రవేశించింది. ఆంగ్ల విద్య, హేతువు, శాస్త్ర విజ్ఞానం ఆధునిక విద్యావంతున్ని ఏకాకిని చేసి అశాంతియుతునిగా మార్చింది. హైదరాబాద్ వంటి ఆధునిక నగరాన మధ్యతరతి విద్యావంతుల్లో సమిష్టి భావన లుప్తమై ఎవరికి వారే బతుకీడ్చే పరిస్థితి వచ్చింది. దీనితో స్వతంత్ర వ్యక్తిత్వం సహా ఆధునిక వ్యక్తి ఆవిర్భావం జరిగింది. విఫలమయ్యే కలలు, ఆశలు, అవాస్తవిక అంచనాల మధ్య సమాజానికి అతనికి ఘర్షణ మొదలైంది. ఈ స్థితిలో అప్పటికే ఆంగ్లం, ఉర్దూ సాహిత్యరంగాలలో కల్లోలం సృష్టించిన డాడాయిజం తొలుత, తర్వాత అతివాస్తవికత వంటి కవితా భావ ధార తెలంగాణ యువకవులను కూడా ఆకర్షించింది.

అప్పటికీ భావకవిత ప్రబలంగా వెలువడుతోంది. అయినప్పటికీ 1926లోనే నెగేషన్ భూమికైన డాడా తరహా కవితా రచనకు పూనుకున్న తొలికవి మూమునూరు నాగభూషణరావు. తన పుట్టుకపై సంశయం, మృత్వువాకాంక్ష, బతుకు నిరర్థకమన్న భావనతో మూడు కవితలు రాశాడు.విజయరాఘవ రావు మగపెత్తనం పాలబడి శల్యమైన ఒక అభాగ్య స్త్రీపై కొత్త అభివ్యక్తి తో ఒక ఒక కవిత రాశాడు. రూపం, భూమిక డాడాదే. పద్య, గేయ లక్షణాలను తెనార్చిన కవిత ఇది. రూపం వచన కవితే అయినా ఖాళీలు వదిలేస్తూ బాగి నారాయణరావు, మరోకవి ప్రయోగాత్మకతకు పదునుపెట్టారు. వీరిద్దరు గొప్పవచన కవితలు రాశారు. అవి 1934లోపే వెలువడ్డాయి. డాడాయిజం వేళ్లూనుకోకపోయినా ఆ భావాలతో వచ్చిన రచనలు కనుక, సాహిత్య చరిత్ర దృష్ట్యా ఈ ప్రతిఫలనాలకు ఎంతో విలువున్నది.

రెండు ప్రపంచ యుద్ధాల మధ్య తలెత్తిన ఆయా కవితా ఉద్యమాలన్నీ ఒకదానిలోంచి మరొకటి పుట్టినవే. కవితా భూమిక అతివాస్తవికతే అయినా రూపవాదం, ప్రతికవాదం కలగలిసి ఉంటాయి. ఇంతేకాదు 1940ల హైదరాబాద్ నుంచి వెలువడిన నవ్యాంధ్ర సాహితీ వీధులు చరిత్ర గ్రంథంలో రచయిత, నిజాం కళాశాల తెలుగు అధ్యాపకుడు సీతారామయ్య భట్టర్ అతివాస్తవికతను ప్రస్తావించాడు. ఇదేకాలాన ఫ్రెంచి కవి రోమారోలా, అల్బర్ట్ స్విటర్ ప్రభావం వల్ల కావచ్చు కవిగా, కార్యకర్తగా చురుకుగా మారిన కాళోజీ అప్పటివరకు తెలంగాణ కవిత్వంలో కొనసాగిన గేయ, పద్యకవితాచ్ఛాయలను, సంప్రదా య వ్యక్తీకరణను, అలంకారితను తిరస్కరిస్తూ కొత్తగా వచన కవితా రూపాన్ని, వస్తువును, ప్రతీకలను ప్రవేశపెట్టి నవీన పం థాలో పయనించాడు. భాషా సరళతను, ఎంతో వైవిధ్యాన్ని సంతరింపజేసి ప్రణయానికి, ప్రళయానికి కొత్త భాష్యం చెప్పిన తిరుగు బాటుకవి కాళోజీ. ప్రయోగశీలత, రూపవాదం ఆనాటి కాలాన అతివాస్తవికతలో భామే. ఈ కారణం వల్లే కావచ్చు కాళోజీని ప్రఖ్యాత ఫ్రెంచి అతివాస్తవిక కవి లూయి ఆరెగాతో శ్రీశ్రీ పోల్చాడు.

1939,1940ల తొలినాళ్లలో పూర్తిస్థాయి డాడాయిస్టు, సర్రియలిస్టు కవితలు కొన్ని రాసిన వాడు యువకవి బూర్గుల రం గనాథరావు. 1941నాటికి ఆయన అతివాస్తవికత కవిత అని చెప్పుకుంటూ ఊహా విమానం పేరుతో కవిత రాశారు. ఆయనకు సహాధ్యాయి దేవులపల్లి రామానుజరావు 1944లలోనే అతివాస్తవికత, అభ్యుదయం పేరుతో ఒక చర్చా వ్యాసాన్ని ప్రచురించాడు. డాడాకవితకు ట్రిట్సన్ జారా, సర్రియలిజానికి ఫ్రెంచి దేశ వామపక్షాల అగ్రశ్రేణి నాయకుడు ఆంద్రీ బ్రితోలు స్థాపకులు, నాజీ, ఫాసిస్టు భావాలకు వ్యతిరేకంగా రూపుదిద్దుకున్న ఆధునిక సాహిత్యానికీ, అందుకు కారణమైన విముక్తి ఉద్యమాల కవిత, ప్రగతిశీల కవితోద్యమాలకు సమాంతరంగా నడిచిన కవితా ప్రభంజనమిది. ఈ భావధారలు యూరోపు యువతరాన్ని, ప్రగతిశీల మేధావులను, కవులను కూడా ఎంతగానో ప్రభావితం చేశాయి. ఫ్రెంచి వామపక్ష ఉద్యమనేతలు, గొప్పకవులు, చిత్రకారులు అయిన డాలి, పికాసోలు, పాల్ ఎలార్డ్‌లు కూడా అతివాస్తవికతను ప్రగతిశీలమైందిగానే భావించారు. ఆంగ్లప్రగతిశీలమేధావి సాహితీవేత్త క్రిస్టోఫర్ కాడ్వెల్ కొంతవరకు అతివాస్తవికతను సమర్థించారు.

దీని వల్లే ఈ ఉద్యమాలకు యూరోపంతటా మద్దతు దొరికింది.1939లలో మొదలై 44ల నుంచి క్రమంగా పుంజుకున్న అతివాస్తవికత, ప్రతీకవాదాలు1947నాటికి ఉద్యమస్థాయికి చేరాయి. రంనాథరావుతో పాటు భాగినారాయణరావు, జమ్మల మడక సూర్యప్రకాశ్‌రావులు అతివాస్తవికత భావాలతో తరుచుగా రాయడం మొదలుపెట్టారు. భారత్, పాకిస్తాన్ విభజన వల్ల జరిగిన హత్యాకాండ, హైదరాబాద్ రాజ్యంలో పోలీస్ యాక్షన్, తెలంగాణలో సామాజిక అల్లకల్లోలం, రెండవ ప్రపంచ యుద్ధం బీభత్సం వంటిదే ఆనాటి భారతదేశం చవిచూసింది. దీనితో ప్రగతిశీల కవితతో పాటు నాటి బీభత్సం, నిరాశజనకం, సామాజిక సం క్షోభ పరిస్థితులను ప్రతిఫలిస్తూ అతివాస్తవిక కవిత ఉద్యమరూపం దాల్చింది. ఇదే కాలాన అతివాస్తవికతను చర్చిస్తూ దాని మ్యానిఫెస్టోతో సహా నవ్యాంధ్ర సాహిత్యవీధులు రెండవ ముద్రణ 1949 లో హైదరాబాద్‌లో వెలువడింది.

సీతారామయ్యభట్టర్ అప్పటికి నిజాం కళాశాలలో ప్రొఫెసర్‌గా తెలుగు పాఠాలు చెబుతున్నాడు. ఆయన ప్రభావం వల్ల కావచ్చు ఆపరిస్థితులను రూపకట్టడానికి కావచ్చు , దాశరథి, బాగీ నారాయణరావు సహా ఆనాటి యువకవులు నిజాం కళాశాల, ఆర్ట్స్ కళాశాల విద్యార్థులైన సినారాయణరెడ్డి, జేవి రాఘవేందర్‌రావు, మాదిరాజు రంగారావు, యశోదారెడ్డి (మారుపేరుతో) అప్పటికే కవులుగా ప్రతిష్ఠులైన వెల్దుర్తి మాణిక్‌రావు, భాస్కరభట్ల కృష్ణారావు, పి రామచంద్రయ్య, సంప్రదాయం వైపు మొగ్గు ఉన్న వానమామలై వరదాచార్యులు కూడా అతివాస్తవికత భూమిక కవితా రచనకు పూనుకున్నారు. వీరి కవితలను 1953లో తెలంగాణ నుంచి వెలువడిన ఉదయ గంట లు, ఆంధ్ర నుంచి వెలువడిన కల్పన సంకలనంలో చూడవ చ్చు. 1953లో వెలువడిన సినారె తొలి సంకలనం జలపాతం లో చాలా కవితలు అతివాస్తవికత రీతికి చెందినవే. ఇదేకాలాన దాశరథి అతివాస్తవికతలోని ఆటోమేటిజాన్ని, పీఎస్‌ఆర్ అంజనేయ శాస్త్రి ప్రగతిశీలతను ప్రస్తావిస్తూ , పరిశోధక విద్యార్థిగా సినారె గొప్ప వ్యాసాలు రాశారు. తెలంగాణ ఆధునిక కవితా సంకలనం ఉదయగంటలకు ప్రతిగా దిగంబర కవి నగ్నముని ఉదయించని ఉదయాలు కవితా సంకలనాన్ని ప్రచురించా డు. ఇంత కంటే ఆధునిక తెలంగాణ ప్రశస్తి ఏముంటుంది..?
- సామిడి జగన్‌రెడ్డి, 85006 32551

973
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles