ప్రకటనలు

Sun,March 3, 2019 11:45 PM

-కావ్య పరిమళం
తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా కావ్య పరిమళంపరంపరలో 2019 మార్చి 8న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్‌లో డాక్టర్ సి. నారాయణరెడ్డి నాగార్జున సాగరంపై డాక్టర్ టి. గౌరీశంకర్ ప్రసంగం ఉంటుంది. సభకు నందిని సిధారెడ్డి అధ్యక్షత వహిస్తారు.
-డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి

రశ్మిత మహిళా కవి సమ్మేళనం

మార్చి 8 అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా 2019 మార్చి 6న రవీంద్రభారతి సమావేశ మందిరంలో సాయంత్రం 6 గంటలకు మహిళా కవి సమ్మేళనం ఉంటుంది. జ్వలిత అధ్యక్షతన జరుగు సభలో షాజహానా, కొండేపూడి నిర్మల, శోభాభట్, రేణుక అయోల, దేవనపల్లి వీణావాణి, స్వాతి శ్రీపాద, నస్నీన్ ఖాన్, సీహెచ్ ఉషారాణి, మెర్సీ మార్గరెట్, అరుణా నారదబట్ల, దాసోజు లలిత, కే. విద్యావతి తదితరులు కవితలు వినిపిస్తారు. గౌరవఅతిథిగా దేవకీ దేవి పాల్గొంటారు.
-ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్, తెలంగాణ సాహిత్య సమాఖ్య, కార్యదర్శి

విద్యార్థులకు కవితా పోటీలు

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర స్థాయిలో విద్యార్థులకు కవితల పోటీలు నిర్వహిస్తున్నాం. భారత్ ప్రణామ్-జవాన్ సలామ్ అంశంపై 20 లైన్లకు మించకుండా వచన కవితలను 2019 మార్చి 20తేదీలోపు అందే లా పంపాలి. కవితను పంపుతున్న వారు పాఠశాల ప్రధానోపాధ్యాయుని ధృవీకరణ పత్రం జతచేయాలి. చిరునామా: సీహెచ్ వెంకటరెడ్డి, వసుంధర విజ్ఞాన వికాస మండలి, ఇంటి నెం:16-1-238, శివాజీ నగర్, గోదావరి ఖని-505209. 9182777409, 9989078568
-వసుంధర విజ్ఞాన వికాస మండలి

ఒంటరి యుద్ధభూమి ఆవిష్కరణ

డాక్టర్ పసునూరి రవీందర్ కవిత్వం ఒంటరి యుద్ధభూమి ఆవిష్కరణ సభ 2019 మార్చి 10న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. జీ లక్ష్మీనర్సయ్య అధ్యక్షతన జరుగు సభలో గౌరవ అతిథులుగా అల్లం నారాయణ, కె. శ్రీనివాస్,గోరటి వెంకన్న హాజరవుతారు. పిల్లలమర్రి రాములు, ఎండ్లూరి సుధాకర్, గోగు శ్యామల, స్కైబాబ పాల్గొంటారు.
-మట్టి ముద్రణలు, 9848015364

622
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles