Telangana Intermediate 1st & 2nd Year Results 2019

బెన్ ఓక్రి

Mon,March 18, 2019 01:12 AM

ben-okri
Our future is greater than our past.. అనే వాక్యంతో నైజీరియా దేశాని కి సాహిత్యరంగంలో అంతర్జాతీయ ఖ్యాతి రావటానికి కారకమైన మహా రచయిత, కవి బెన్ ఓక్రి! సాహితీ అభివ్యక్తికి Surrealism హంగులను, Magic Realism రంగులను అద్ది, కవిత్వాన్ని విశ్వ జనీనం చేసిన సృజనకారుడు బెన్! ఆఫ్రికన్ స్థానిక జాతీయ సంస్కృతుల విధ్వంసాన్ని, యూరప్ దేశాల వలసవాద దోపిడీని, నైజీరియా దేశ రాజకీయాల్లోని అవినీతిని, ఆధునికానంతర కాల పు మానవ సంక్షోభాలను తన రచనలలో అత్యంత ప్రతిభావం తంగా ప్రతిఫలింపజేయటమే కాక, నైజీరియా ప్రజల ఆకాంక్షలను విశ్వయవనిక మీద ప్రతిబింబించడంలో కృతకృత్యుడయ్యాడు.
నైజీరియాలోని మిన్నా నగరంలో జన్మించిన బెన్, తన 2వ ఏటనే తల్లిదండ్రులతో పాటు లండన్ వెళ్లి కొన్నాళ్ల తర్వాత తిరిగి నైజీరియా వచ్చాడు. మొదట్లో Physicist కావాలన్న ప్రగాఢంగా కోరిక ఉన్నప్పటికీ,ఆ కోర్స్‌లో సీట్ రాకపోవటంతో సాహిత్యం వైపు మళ్ళాడు. దేశ రాజకీయాలు, ప్రభుత్వ వైఖరులపై తీవ్ర విమర్శ లతో కథలు, రచనలు చేయటంతో బెన్ పేరును ప్రభుత్వం Death Listలో పెట్టింది. దాంతో 1978లో నైజీరియా నుంచి London వెళ్లి అక్కడ తులనాత్మకం సాహిత్యం చదివాడు. ఆ సమయంలో నైజీరియా ప్రభుత్వం ఉపకార వేతనం నిలిపివేయటంతో Lond -on, Park లలో చదువును పూర్తిచేశాడు.
తన రచనా ప్రస్థానాన్ని మొదట నవలతో ప్రారంభించి Flo -wers and Shadows(1980), The Landscapes Within (1981), Songs of Enchantment (1993), Infinite Rich -es (1998),Dangerous Love (1996) వంటి నవలలు రాశా డు. Incidents at the shine (1986), Stars of the New Curfew (1988) పేరుతో కథా సంకలనాలను ప్రచురించాడు. An African Elegy(1992), Mental Fight (1999) అనే దీర్ఘ కవితలను కూడా రాశాడు.
1991లో బెన్ తాను రాసిన The Famished Road నవలకు ప్రఖ్యాత Booker prize గెలుచుకోవడమే గాక, ఆ పురస్కారాన్ని సాధించిన అతిపిన్న వయస్కుడిగా (అప్పటికి అతని వయస్సు కేవలం 32 ఏండ్లే) రికార్డ్ సృష్టించాడు.

ఒకానొక ఆఫ్రికన్ స్మృతి గీతం!

కాల ఫల రుచి అత్యంత చేదు
దాన్ని ఆస్వాదించడానికి
దేవుడు సృష్టించిన అద్భుతాలం మనం
మనం అమూల్యం
ఏదో ఒకరోజు మన ఈ దుఃఖ గాథలన్నీ
ఈ భూమిపై వింతలుగా మిగిలిపోతాయి
నన్ను దహించే కొన్ని ప్రశ్నలు
ఇప్పుడు నా ముందున్నాయి
నా సంతోషంలో
అవి స్వర్ణమయమై వెలుగుతాయి
మన వేదనా రహస్యాన్ని నువ్వెప్పుడైనా చూసావా?
ఒకవైపు దారిద్య్రాన్ని అనుభవిస్తున్నాం
మరోవైపు మధురోహలతో స్వప్నిస్తూ, పాడుతూ ఉంటాము!
వీచే పవనాలు వేడెక్కి
ఊపిరి పీల్చుకోవడం సైతం దుర్లభమైనప్పుడు
మనం గాలిని నిందించలేదు!
పండ్ల తీయని రుచులతో
మనం తృప్తిచెందినప్పుడు,
నీటి అలలపై సున్నితంగా
కాంతికిరణాలు ప్రతి ఫలిస్తున్నప్పుడు కూడా
మనం ఎవ్వరినీ శపించలేదు!
మన బాధల్లో సైతం.. అందరినీ ఆశీర్వదించాం
మౌనంగానే అయినా.. అందరూ బాగుండాలని దీవించాం!
అందుకే, మన సంగీతం అంత మధురంగా ఉంది
మోసుకొచ్చే గాలులు కూడా జ్ఞాపకం పెట్టుకునేంతగా
అన్నట్టు, ఆచరణలోనే కదా.. ఎన్నెన్నో రహస్య వింతలను
కాలం తోసుకొని ముందుకు తెస్తుంది
నమ్మవేమో కానీ.. మృతులు సైతం పాటలు పాడటాన్ని
నేను కూడా విన్నాను!
ఇదంతా చూసినందుకో ఏమో
నాతో వాళ్లన్నారు
కొంచెం అగ్నితో, నిత్యాశతో.. ఈ జీవితం బాగుందని
దీన్ని అనునయంగా జీవించాలని
ఇలా బతుకడంలోనే ఓ విచిత్రం ఉందని!
ఇక్కడే ఓ అమితాశ్చర్యం కూడా ఉంది
ప్రతీ అంశంలో
అదృశ్యమైనదేదో లీలగా కదలాడుతూ ఉంటుంది
ఈ సముద్రం నిండా పాటలూ, సంగీతాలే పర్చుకుంటాయి!
ఇక, విధినే మన ఆత్మీయ నేస్తంగా ఎంచుకున్నాం
అప్పుడు, ఆకాశం మనకు శత్రువు కాదు కదా!!
-మూలం: బెన్ ఓక్రి
స్వేచ్ఛానువాదం: మామిడి హరికృష్ణ, 80080 05231

170
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles