ఒక దేహం.. రెండు శివార్లు

Mon,March 18, 2019 01:11 AM

ఎప్పుడు మేఘావృతం అవుతదో
కనిపించని నెలరాజు కోసం
చుక్కలు కలవరపడతయి!
ఏది దిక్కు విలపిస్తదో
కుమిలిన ఏడ్పు వినలేని చెవులు
మూసిన కమ్మలో
విచ్చిన నెమలికన్ను తెరవలేవు!
ఈ దరి మీంచి ఆ దరికి
రెండు బంధాల నడుమ అల్లుకున్న పేగు
స్పర్శకు ముందే తెగిపోతున్నది!
పొద్దు గూకుతది
తెల్లారదు..
చిలుంబట్టిన ఇనుప కన్నుకు
ఇత్మారుండదు
ఒక భౌతిక విన్యాసమే
నేనరులేని రసాయన సమ్మేళనం
న్యూటన్ మూడోనేత్రం
అంతా ఆటవిక చర్యేనా!
నమ్మకస్తుడైన శతృవు
మృగయా వినోదం
మట్టిలో రూపుకట్టిన ప్రాణం
మనిషై మాట్లాడేది దేశం
మనిషికి గోడలా..! దేశానికి ఎల్లలా..!
ఈ రంగురంగుల మొహాలెక్కడివి
వక్రరేఖల శిబిరాలెక్కడివి
మెరుపు వంకుల పొదిగిన గూళ్లేక్కడివి
భయాలకు అభయమిచ్చి
బతుకు భరోసాలేని సైనికుడు
మనిషితనాన్ని ప్రశ్నిస్తున్నడు చూడు..!
- బెల్లంకొండ సంపత్‌కుమార్ 9908519151

173
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles