‘సారస్వత’ పూల గుత్తులు

Thu,June 20, 2013 05:38 PM

తెలంగాణలో 20వ శతాబ్ది ఆరంభంలో మొదలైన సాహితీ ఉద్య మం రాజకీయోద్యమంతో పెనవేసుకుపోయింది. 190లగంథాలయోద్యమానికి బీజం పడింది మొదలు1944లో భువనగిరిలో జరిగిన పదకొండవ సభలో ఆంధ్ర మహాసభపై కమ్యూనిస్టులు ఆధిపత్యం సాధించే నాటి వరకు తెలంగాణ రాజకీయ రంగంపై అనేక పరిణామాలు వేగంగా వచ్చాయి. పదవ సభ నాటికే సైద్ధాంతిక విభేదాలు తారస్థాయికి చేరుకుని, కమ్యూనిస్టు అభ్యర్థి ఓటమి పాలయ్యా డు. ఈ వేడెక్కిన వాతావరణంలో 1943లో ఆంధ్ర సారస్వత పరిష త్తు పురుడు పోసుకున్నది. నిజాం పాలనలో అణచివేతకు గురవుతు న్న తెలుగు భాషను కాపాడుకోవడానికి ఈ సంస్థ పుట్టింది అనుకునే కన్నా, నాటి రాజకీయ, సాహితీ వాతావరణం నేపథ్యాన్ని చెప్పుకుం అతికినట్టుగా ఉంటుంది.

నాటికి తెలంగాణ సమాజం సాధించిన చైతన్యాన్ని చెప్పుకోవడమే గొప్పగా ఉంటుంది. సురవరం ప్రతాప రెడ్డి, మాడపాటి హనుమంత రావు వంటి పెద్ద మనుషులు ఈ సంస్థ ను ఏర్పరచారు. ఈ సంస్థ ఏర్పడిన నాటి నుంచి సాహిత్య సేవ సాగిస్తున్నది. ప్రాచ్య కళాశాల, పండిత శిక్షణ కళాశాల ఏర్పాటు చెప్పుకోదగినది. వందలాది పుస్తకాలు ప్రచురించింది. అనేక సాహితీ కార్యక్షికమాలను నిర్వహించడమే కాదు, వేలాది సభలకు వేదిక.
తెలంగాణలోని ఎనుకటి సంస్థలలో ఒకటైన ఆంధ్ర సారస్వత పరిషత్తు ఈ ఏడాది ‘సప్తతి మహోత్సవం’ సందర్భంగా కొన్ని పుస్తకాలను ప్రచురించింది.

వ్యాస గుళుచ్ఛం రెండు భాగాలలో భిన్న అంశాలపై వ్యాసాలున్నాయి. పరిషత్తు లోగడ నిర్వహించిన సాహిత్య కార్యక్షికమాలలో ఆయా అంశాలపై నిపుణుల ప్రసంగాలనే వ్యాసాల రూపంలో ప్రచురించారు. ఈ వ్యాసాలతో పాటు ఆయా ప్రముఖుల ప్రసంగ తేదీలు ఇస్తే బాగుండేది. ఉదాహరణకు పదమూడేండ్లుగా తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నది. చెప్పుకోవడానికి కటువుగా ఉన్నా కొందరి రచనలు స్థానికతను, సందర్భాన్ని వ్యక్తం చేయవనేది తెలిసిందే. తెలంగాణ ఉద్యమం అనేక కోణాల్లో ప్రకటితమవుతున్నా ఇప్పటికీ ఆంధ్ర దృష్టి కోణం నుంచి చూసే తెలంగాణ రచయితలూ ఇంకా ఉన్నారు. వీరికి సంస్కరణ అనగానే వారికి గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగమే యాదికి వస్తారు. ఉర్దూ మీద వ్యాసం రాస్తే పొరపాటున హైదరాబాద్ లేదా దక్కన్ యాదికి రాదు. సంపాదకులు వ్యాసాలు కూర్చెటప్పుడే సామాజిక, ప్రాంతీయ కోణాలలో సరి చూసుకోవడం ఇప్పటి పరిస్థితి. పలువురు తెలంగాణ ప్రముఖులు తెలంగాణ కోణంలో రాసిన వ్యాసాలు ఈ రెండు భాగాలలో చోటు చేసుకున్నాయి. కొన్ని వ్యాసాలు తెలంగాణ కోణంలో రాసినవి కూడా ఉన్నాయి.

వ్యాస గుళుచ్ఛం రెండవ భాగంలోని ‘తెలంగాణ మాండలికం’ వ్యాసంలోనైతే డాక్టర్ మలయశ్రీ తెలంగాణ మాండలికం తరఫున వకాల్తా పుచ్చుకున్న తీరు మంచిగున్నది. ‘గ్రాంథిక భాష వ్యాప్తియందున్న కాలాన... అన్ని ప్రాంతాల మన తెలుగు కవులకు- కావ్యాలకు సమానాదరం లభించింది. ఈ వ్యావహారిక భాషావాదంతోనే కోస్తా మాండలికం అందలమెక్కి, తెలంగాణ మాండలికం నిరాదారణకు గురి అయ్యింది’ అనే భావన ఆలోచింప దగినది. ‘ఆంధ్రప్రదేశ్ అవతరణ (1956) తరువాత సైతం డాక్టర్ పి. యశోదారెడ్డి , సురమౌళి, గూడూరి సీతారాం... ఇక్కడి మాండలికంల రచనలు చేసినా, పత్రికల- పబ్లిషర్ల పుణ్యమా అని క్రమంగా అది కనుమరుగై , కోస్తా మాండలికమే విజృంభించింది. అందుకు రాజకీయాధికారం తోడయింది. సినిమా-రేడియోలు సహకరించినై’ అని వివరించారాయన. కోస్తాంధ్ర కుంఫినీ పాలనకింద ఉండడం వల్ల, మద్రాసు రాజధాని కావడం వల్ల తమిళ భాషా క్రియా పదాల పలుకుబడి ప్రభావంతోని కోస్తా తెలుగు క్రియల రూపాలు మారినై అని మలయశ్రీ వివరించారు. తెలంగాణ పత్రికలు ఇక్కడి భాషను, మాండలికాన్ని పట్టించుకోవాలనే ఆయన ఆవేదన అర్థం చేసుకోవాలె.

సారస్వత పరిషత్తు ‘తెలంగాణలో తెలుగు సాహిత్య వికాసం’ పేర ఒక పుస్తకమే ప్రచురించడం హర్షణీయం. ఇందులో కసిడ్డి వెంకట రెడ్డి తెలంగాణలో తెలుగు పద్య కవితా వికాసంపై రాశారు. తొలి కవి పాల్కురికి సోమనాథుడు మొదలుకొని జిల్లాల వారిగా పద్య కవులనూ ప్రస్తావించారు. సంస్థానాల్లో సాహితీ వికాసాన్ని కూడాఅందించారు. తెలంగాణ నేల ఔన్నత్యానికి, సంస్కృతీ సంప్రదాయాలకు చెందిన చరివూతను తెలుసుకోవడానికి గేయ సాహిత్యం ప్రధాన ఆధారం అంటారు పసునూరి రవీందర్ ‘తెలంగాణ గేయ కవిత్వం’ అనే వ్యాసంలో. ఇప్పటికీ జానపద గేయ సంపద జానపద కళారూపాల్లో భాగంగా అవిభాజ్యంగా, సజీవంగా ఉందని ఆయన వివరించారు. ఉద్యమ, సంక్షోభ నేపథ్యాలను కూడా ఆయన ఉదాహరణలతో అందించారు. బన్న అయిలయ్య తెలంగాణ వచన కవితా వికాసంపై వ్యాసం రాశారు. కాలువ మల్లయ్య తెలంగాణలో తెలుగు కథా సాహిత్య వికాసంపై వ్యాసం రాశారు.

బి.ఎస్.రాములు ‘తెలంగాణ నవల’ వ్యాసంలో 1990ల దాకా దళిత బహుజన సాహితీ వేత్తల గురించి, ఈ వర్గాల వారు ముందుకు వచ్చి ప్రశ్నించే వరకు, సాహిత్యకారులు, సంపాదకులు, పాఠ్యపుస్తకాల రూపకర్తలు పట్టించుకోలేదని ఎత్తి చూపారు. ఉద్యమ చైతన్యంతో తెలంగాణ తనను తాను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నదని వివరించారు. శ్రీనివాస్ దెంచనాల ‘తెలంగాణలో నాటక వికాసం’ గురించి రాశారు. రావి ప్రేమలత ‘తెలంగాణలో సాహిత్య విమర్శ వికాసం’ మీద రాసిన వ్యాసంలో ప్రాంతీయ అస్తిత్వ వాద నేపథ్యాన్ని వివరించారు. సంగిశెట్టి శ్రీనివాస్ ‘అక్షర దివిటీలు’ వ్యాసంలో తెలంగాణ పత్రికల వివిధ దశలను వివరించారు. నిజాం వ్యవసాయాభివృద్ధి కోసం 1886లో శేద్య చంద్రిక పత్రికను ప్రారంభించిన నాటి నుంచి పత్రికా రంగం వేసిన తొలి అడుగులను ఏర్చి కూర్చి వివరించారు. సామాజిక, రాజకీయ నేపథ్యాలలో పత్రికల ఆవిర్భావాన్ని వివరించిన తీరు కూడా మంచిగున్నది. తెలంగాణలో వికాస దశను, విశాలాంవూధలో క్షీణ దశనూ వివరించారు. తెలంగాణ పత్రికలపై ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు, అకాడమీలు, విశ్వవిద్యాలయాలు చిన్న చూపు చూస్తున్నాయని ఆయన ఉదాహరణలతో వెల్లడించారు.


‘పరిణత వాణి’ సారస్వత పరిషత్తు వెలువరించిన తాజా పుస్తకాలలో నాలుగవది. సాహిత్య, సాంస్కృతిక భాషా రంగాలకు చెందిన అరవై, డెబ్బయి ఏండ్లు దాటిన ప్రముఖుల చేత వారు సాగించిన కృషిని వివరించే ప్రసంగాలు ఇప్పించిన సారస్వత పరిషత్తు, ఆ ప్రసంగాలను పుస్తక రూపంలో తెచ్చింది. ఇందులో సి. నారాయణ రెడ్డితో పాటు అంపశయ్య నవీన్, కె.వి. రాఘవా చారి, జి.ఎస్. వరదా చారి, ముదిగంటి సుజాతా రెడ్డి, ఎస్వీరామారావు, కోవెల సుప్రసన్నాచార్యులు తదితరుల ప్రసంగ వ్యాసాలున్నాయి. ఆరు పదుల వయసు దాటిన వారు కనుక ఇక్కడ నేల మీది అనేక పరిణామాలలో భాగమైన వారి జీవితాలు మనకు కనిపిస్తాయి. ఆనాటి సాంఘిక పరిస్థితులను కూడా కండ్ల ముందు నిలబెడతాయి. సినారే పుట్టి పెరిగిన వాతావరణం, నవీన్ అంపశయ్య రాసినప్పటి సంగతులు తెలుసుకోవచ్చు. తెలంగాణ చరిత్ర అణచివేతకు గురైన నేపథ్యంలో ఇందులోని ప్రముఖుల జీవితాలలోకి తొంగి చూడడం ద్వారా అప్పటి సామాజికాది రంగాలలో నెలకొన్న పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. సారస్వత పరిషత్తు చేసిన ఈ కృషి అభినందనీయం.

-పరాంకుశం వేణుగోపాల స్వామి

368
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles