ఫుల్‌స్టాప్‌కు పునర్జన్మ

Mon,March 18, 2019 01:13 AM

కొద్ది వ్యవధిలో మూడు సంపుటాలను వెలువరించడం చిన్న విషయమేమీ కాదు. పైగా ఏదోఒకటి రాసేసి దేశం మీదకు వదిలేద్దాం అన్నట్టుగా కాక తన వామపక్ష భావజాల తీవ్రతనూ తన సామాజిక అవగాహన సాంద్రతనూ రం గరించి కవిత్వాన్ని సాహితీ ప్రియులకు అందించడం ఆయ న పుస్తకాల ప్రత్యేకత. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కాగడా నెత్తిన అరుంధతీ నక్షత్రాలను ఉండీలేనట్టున్నాయనే సంప్రదాయాధునిక సహజీవనుడీ మువ్వా. భౌతిక పద అర్థం నైతిక పదార్థమేనని నెమరువేసుకునే ఫ్లాష్ ఫ్రంట్ దార్శనికుడీ శ్రీనివాసరావు.
srinivasa-rao
Only the very weak minded
refuse to be influenced
by Literature and Poetry
- Cassandra Clare
అవును నిజం. బలమైన సమాజాన్నీ, మేధావి వర్గాలనూ ప్రభావితం చేయడానికి సాహిత్య మూ కవిత్వమూ ప్రధాన వనరులు. రేపటి ప్రపంచం సౌష్టవంగా, ఆరోగ్యంగా, సంక్షేమంగా, బుద్ధిజీవిగా ఉండాలంటే సాహిత్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. సాహిత్యాన్ని కాపాడుకోవడమంటే కవిత్వ మేళాలు నిర్వహించడం, సాహిత్యోత్సవాలు జరుపుకోవడం, అక్షర వేడుకలు చేసుకోవడం. ప్రభుత్వాలు ప్రపంచ తెలుగు మహాసభలు వంటి కార్యక్రమాలతో ఈ సాహితీ పరిరక్షణ ను చేపడుతుంటే ఖమ్మం లాంటి నగరాల్లో కొందరు వ్యక్తు లూ కొన్ని సంస్థలూ కూడా ఇందుకు నడుం బిగిస్తున్నా యి. అటువంటి సంస్థల్లో ఖమ్మంలో ప్రతి ఏడూ ఒక సాహి త్య పండుగనూ ఒక సాహిత్య జాతరనూ నిర్వహించే మువ్వా పద్మావతీ రంగయ్య ఫౌండేషన్ ఒకటి. ఏటా ఈ ఫౌండేషన్ ఒక సాహితీవేత్తకు అవార్డునిస్తుంది. ఆ సందర్భంగా ఉభయ రాష్ర్టాల్లోని సాహితీ ప్రముఖులందరినీ ఈ ఫౌండేషన్ చైర్మన్, కవీ మువ్వా శ్రీనివాసరావు ఖమ్మానికి ఆహ్వానిస్తారు. ఇప్పటివరకూ ఈ ఫౌండేషన్ శివారెడ్డికి, నగ్నమునికీ, గోరటి వెంకన్నకూ అవార్డులు అందజేసింది. ఈ ఏడాది అవార్డునూ గతేడాది పురస్కారాన్నీ కలిపి ఈ నెల 23న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కవి దేవిప్రియకు, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజకూ అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో ఒక భారీ సాహిత్య తిరణాల జరుగనుంది. రెండు రాష్ర్టాల ప్రముఖ కవులందరూ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. సాహి త్య చర్చలకూ విశ్లేషణలకూ సానుకూల విమర్శలకూ సం దర్భం వేదిక కానున్నది.

ఖమ్మంలో జరిగే సాహిత్య వేడుక గురించీ మాట్లాడుకునేప్పుడు మువ్వా పద్మావతీ రంగయ్య ఫౌండేషన్ చైర్మన్, కవీ, మువ్వా శ్రీనివాసరావు గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. మువ్వా శ్రీనివాసరావు ఏటా ఈ అవార్డును సాహితీ ప్రముఖులకు అందచేస్తున్నారు. ఇదే సందర్భంలో తన కవితా సంకలనాలను కూడా ఆవిష్కరిస్తుంటారు. ఇప్పటివరకూ ఆయన సమాంతర ఛాయలు, సిక్త్స్ ఎలిమెంట్ అనే కవితా సంకలనాలు వెలువరించారు. ఈ నెల 23న జరిగే ఉత్సవంలో తన మూడో కవితాసంకలనం వాక్యాంతం కూడా ఆయన విడుదల చేస్తున్నారు. ఇదే వేదికపై 9 మంది యువస్వరాలను కూడా ప్రత్యేకంగా సత్కరించనున్నారు. నిజానికి మువ్వా శ్రీనివాసరావు గురించి మాట్లాడటమంటే కేవలం ఆయన నిర్వహించే కార్యక్రమా ల గురించి మాట్లాడటం కాదు. ఆయన కవిత్వం గురించి మాట్లాడకుంటే చాలా శూన్యం మిగిలిపోతుంది. కొద్ది వ్యవధిలో మూడు సంపుటాలను వెలువరించడం చిన్న విషయమేమీ కాదు. పైగా ఏదోఒకటి రాసేసి దేశం మీదకు వదిలేద్దాం అన్నట్టుగా కాక తన వామపక్ష భావజా ల తీవ్రతనూ తన సామాజిక అవగాహన సాంద్రతనూ రం గరించి కవిత్వాన్ని సాహితీప్రియులకు అందించడం ఆయ న పుస్తకాల ప్రత్యేకత. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కాగడా నెత్తిన అరుంధతీ నక్షత్రాలను ఉండీలేనట్టున్నాయనే సంప్రదాయాధునిక సహజీవనుడీ మువ్వా. భౌతిక పద అర్థం నైతిక పదార్థమేనని నెమరువేసుకునే ఫ్లాష్ ఫ్రంట్ దార్శనికుడీ శ్రీనివాసరావు. తన ప్రాణం మీద తానే ఎర్రగుడ్డ కప్పుకొని గాంగ్నం గీతాన్ని కోలవెరిగా పాడలేని విశ్వాసమే శ్వాసైన సైద్ధాంతికుడీ క్రాంతి శ్రీనివాసరావు.

చాలామంది సాహిత్యకారులు సాహిత్య కార్యకర్తలుగా ఎనలేని శ్రమకోడుస్తారు. మనం చెప్పుకున్న లిటరరీ ప్రిజర్వెన్స్ కోసం వాళ్లు రకరకాల కార్యక్రమాలను వేదికలనూ సృష్టించి సాహిత్య సేవచేస్తుంటారు. చాలా సందర్భాల్లో ఈ సాహిత్యకారుల సాహిత్యకృషి వాళ్ల సాహిత్య సామర్థ్యాన్ని మరుగున పడేస్తుంది. వారిని సాహిత్య ప్రపంచం కేవలం సాహిత్య కార్యకర్తలుగానే నమోదుచేస్తుంది. అయితే మువ్వా తాను సాహిత్య పరిరక్షకుడిగా ఉంటూనే తన కవిత్వంతో సాహితీ ప్రపంచం మీద గొప్ప ముద్రవేశారు, వేస్తున్నారు. ఆయనను రేపటి సాహితీలోకం మంచి కవిగా గుర్తుంచుకుంటూనే సాహితీకార్యకర్తగా కూడా ప్రశంసిస్తుందనడంలో సందేహం లేదు. కొత్త పుస్తకం వాక్యాంతం పేరిట విడుదల చేస్తున్న మువ్వాను అభినందించడానికి సాహిత్య ప్రపంచం ఎదురుచూస్తోంది. నిజానికి ఈ కవి వాక్యాంతం అని అంటున్నాడు కానీ.. నిజానికి ఇతని అక్షరాలది కొత్త గుణింతం. ఇతని వాక్యాలది కొత్త వ్యాకరణం. వెరసి మువ్వా కవిత్వం ఫుల్‌స్టాప్‌కు పునర్జన్మ. కవిత్వమూ సాహిత్య సేవ అనే రెం డు పార్శాలనూ ఒకే ముడిగా కలిపి కుట్టిన మువ్వా శ్రీనివాసరావులాంటి కవిత్వ కార్యకర్త, మెగా కవీ చాలా అరు దు. మువ్వా నిర్వహిస్తున్నటువంటి సాహిత్య వేడుకలూ తెలంగాణలో ఊరూరా జరుగాలన్నదే సాహిత్య ప్రపంచ ఆకాంక్ష.
- బెల్లంకొండ

186
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles