ఎస్వీ సాహితీ యశస్వి..

Mon,September 1, 2014 01:10 AM

profsvsatyanaranaహృదయంలో ప్రేమ మధురిమలను పరిమళిస్తుంది. మర్యాద తెలియని మనుష్యుల ఇరుకుల్లో పడి మాడి మసి బొగ్గయి పోతున్న తరుణంలో మానవత్వపు మమతల అమృతాన్ని సమాజానికి నిందు హృదయంతో అందిస్తున్నాడు. గులాబీ అందాన్ని, సింహబలాన్ని.

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ఎస్.వి. సత్యనారాయణను చూసినప్పుడు నన్నా పరిమళం పరవిశింపచేసింది. ఈ ముఖంలో, ఆ కళ్లల్లో, ఆ చూపులో ప్రేమల పరిమళాలు మనకు తెలుస్తాయి. ఆ అందాలు మనల్ని పలకరిస్తాయి. ఆ పరిమళాలను అహర్నిశం జీవితంలో కాపాడుకోవడం ఒక వరం.
హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజా చార్మినార్‌కు దక్షిణంగా కిలోమీటరు దూరంలో ఉన్న వెంకట్రావ్ మెమోరియల్ హైస్కూల్. ఆ పాఠశాలలో 1970లో పదోతరగతి విద్యార్థి ఎస్‌వీ సత్యనారాయణ.

తరగతి గదిలో దాదాపు నలభై మంది విద్యార్థులు. తరగతి గదిలో అడుగుపెట్టిన తర్వాత ఉపాధ్యాయుడు చేసే పని విద్యార్థులను పలకరింపుగా చూడటం. ఆ ముఖాలలో అమాయకమైన అందాలు, నిర్మలమైన ప్రేమ, అనురా గం, ఉపాధ్యాయుల పట్ల భక్తి పాఠం బోధించే ముందు, బోధన మధ్యలో, చివర్లో విద్యార్థుల దగ్గరకు పోయి వారితో మాట్లాడి, వారి నోట్‌బుక్స్, హోమ్‌వర్క్ చూడ టం ఉపాధ్యాయుడు చేసే పనుల్లో ఒకటి. అట్లా హోమ్ వర్క్ చూస్తున్నప్పుడు ఒక విద్యార్థి నోట్ బుక్‌లో కవితా చరణాలు కన్పించాయి. తీసి చదివాను. కవిత్వమే. ఇదేమిటి? నాకూ అర్థం కాలేదు. కవిత్వం అంటే ఇష్టమా.. ఈ విద్యార్థికి. కవిత్వం అంటే రాసి తెచ్చుకునేంత అభిమానమా ఈ విద్యార్థికి. అదీ నా సందేహం. ఏం చెప్పా లో తెలియక మౌనంగా చూస్తున్నాడు ఆ విద్యార్థి. ఆ చూపులో సంతోషం. ఆత్మవిశ్వాసం. భాషకు అందని జవాబు.మౌనం. తీసిచదివాను.

కవిత్వం.. అక్షరం అక్షరం కవిత్వం పరిమళిస్తున్న.. పద్దెనిమిది పంక్తుల వచన కవిత్వం. ఎవరు రాశారు? నేనే సార్. అవునా? మరో సారి చదివాను. తరగతి పిల్లలంతా మా ఇద్దర్ని చూస్తున్నారు. ఈ కవిత పదిహేనేళ్లు నిండని ఈ బాలుడు రాసినట్టు లేదు. చెయ్యి తిరిగిన కవులు రాసినట్టుంది.

అందుకే ఆశ్చర్యం. అందుకే ఆనందం. మమత లేని జీవితాలు. పదిహేనేళ్ల వయసులో మమత లేని జీవితాలు గురించి తెలుస్తుందా? అర్థమవుతుందా? ప్రపంచానికి అవసరమైన ఒకే ఒక అందం మమత!అట్లాంటి మమతను రక్షించుకుందాం అంటూ ప్రార్థిస్తున్నాడు ఈ విద్యార్థి. మానవత్వపు అమృ త కలశాన్ని ప్రపంచానికి అందిస్తున్నాడు. మమతానురాగ తేజోదీప్తిని గానం చేస్తున్నాడు. ఈ అమృతపు చినుకులు కురవాలంటే అది రుషి హృదయం కావలసిందే.

అమృతకలశాన్ని చేతుల్లో పట్టుకుని నిలుచున్నాడా విద్యార్థి. పువ్వు పుట్టగానే పరిమళించడం అంటే ఇదే. ఆ కవిత చదివి ఉబ్బి తబ్బిబ్బయ్యాను. సాహిత్య సౌంద ర్యం పట్ల ఆరాధనా భావం గల రచయితను కావటం వల్ల ఆ కవిత నన్ను ఒలలాడించింది. అప్పటి కే నా తొలి కథల సంపుటి మంచుపల్లకి- మరి తొమ్మిది జూలై 1968 ఎమెస్కో ప్రచురణగా వచ్చింది. ఈ కవిత ను మరోసారి చదువుకుని తెల్ల కాగితం మీద మంచిగ రాసి ఇమ్మన్నాను. కరీంనగర్ నుంచి అప్పట్లో వస్తున్న విద్యుల్లత సాహితీ మాసపత్రికకు ప్రచురణ కోసం పం పించాను. విద్యుల్లత మే 70 సంచికలో ఎస్.వి. సత్యనారాయణ తొలి కవిత వి.ఎమ్. హైస్కూల్, లాల్ దర్వాజా, హైదరాబాద్-2 చిరునామాతో సైతం వచ్చిం ది. రక్షించుకుందాం!.

ఈ నలభై ఏళ్ల కాలంలో ఇప్పుడే మనిసిస్తుందంటే ఈ కవి జీవిత నినాదం రక్షించుకుందాం మానవతని అయి సాగిందని.ఈ రక్షించుకుందా అని గానం చేస్తున్న ఈ కవిత అందమంతా మానవతా సౌందర్యమే. ఆ సౌందర్యాన్ని చూడగల చూపు పదిహేనేళ్ల విద్యార్థికి కలగడం ఇప్పటికీ నాకు ఆనందమే. ఆశ్చర్యమే. మానవత్వపు అమృతాన్ని ప్రపంచానికి రుచిచూపించటమే. విశ్వమానవునకు కోరేది, పోరాడేదీ ఈ అమృతం కోస మే. మానవత్వపు సౌందర్యాన్ని కవి ఎట్లా ఆవిష్కరిస్తున్నాడో చూద్దాం. గులాబీ అంతటి సున్నితం. సింహం అంతటి శక్తి.

జీవితంలో మానవతా విలువలను పోరాటంలో తప్ప కాపాడుకోలేం. పోరాట శీలత జాతి వజ్రాయుధం. జీవితంలో, సమాజంలో అన్యాయాలతో పోరాటం సాగించాల్సిందే. మార్గాంతరం లేదు. చాకు పోట్లకు నరాలు తెగిపోయినా, గుండెలు పగిలిపోయినా నిరంతరం నిర్విరామంగా సింహంలా పోరాటం సాగించాల్సిందే. ఇవి ప్రపంచ మానవతా శాంతి సందేశం.

సాహిత్యానికి ఒక అద్భుతమైన, మహోన్నతమైన శక్తి ఉంది. అది మనిషికి కొత్త చూపు నిస్తుంది. అంతరేక్షణ నిస్తుంది. జాతి మంచి కోసం పోరాట శక్తి నిస్తుంది. మన అంతరంతరాల్లో అమృత భాండాన్ని నింపుతుంది. దక్షిణాఫ్రికాలో ఉంటున్న మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ, రష్యన్ మహారచయిత లియో టాల్‌స్టాయ్ రచనా ప్రభావంతోనే ఆత్మశక్తిని పొంది స్వాతంత్య్ర యోధుడయ్యా డు. భారత జాతి విముక్తి పోరాటం సాగించాడు. మహాత్ముడయ్యాడు. అహింసా ఆయుధాన్ని ప్రపంచానికి ప్రసాదించాడు. ఎస్.వి. సత్యానారాయణ తొలి కవిత రక్షించుకుందాంలో ఈ పోరాట శక్తే ప్రేమ సందేశమై అభ్యుదయ శక్తులతో గొంతు కలిపింది.

నర పిశాచాల చాకు పోట్లకు
నరాలన్నీ తెగిపోయినా
ఓటమిని అంగీకరించకు ప్రపంచంలో మనకు కన్పించే నరపిశాచాల సంఖ్య కూడా తక్కువేం కాదు. నిత్యం మనం మన కళ్లతో చూస్తున్నదే. మన మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడి చేస్తున్నదే. మానవత్వాన్ని బలిగొంటున్నదే. ఈ ధీశక్తి గురించి రాస్తున్న కవి పదిహేనేళ్ల పదో తరగతి విద్యార్థి. సర్వ ధర్మాల సారం మానవతను రక్షించు కోవటమే. రక్షించుకుందాం అన్న శీర్షికలో సర్వ ప్రపంచాన్ని రక్షించుకుందాం. అన్న ఆత్మీయ ఆధ్యాత్మిక స్ఫూర్తి ధ్వనిస్తుంది. హృదయంలో ప్రేమ మధురిమలను పరిమళిస్తుంది.

మర్యాద తెలియని మనుష్యుల ఇరుకుల్లో పడి మాడి మసి బొగ్గయి పోతున్న తరుణంలో మానవత్వపు మమతల అమృతాన్ని సమాజానికి నిందు హృదయంతో అందిస్తున్నాడు. గులాబీ అందాన్ని, సింహబలాన్ని.

కవిత్వం ఒక్కటే కాదు, అన్ని కళలూ పుట్టుకతో వచ్చే సహజాతాలే. స్థిత ప్రజ్ఞులయిన వారు, పుట్టుకతో వచ్చిన ఆ కళలకు అంకితమై పోతారు. తమ నిరంతర సాధన కొనసాగిస్తారు. ఆ స్థిత ప్రజ్ఞాత్వమే ఎస్.వీ. సత్యనారాయణని సాహితీ మార్గదర్శని చేసింది. అమృత తుల్యమైన విద్యను బోధించే సద్గురువును చేసింది. అభ్యుదయ మార్గాన నడిచే సాహితీ వేత్తను చేసింది. కవిత్వమే కాకుండా అభ్యుదయ సామ్యవాద పోరాటయోధుల జీవిత చరిత్రలు, పరిశోధనలు, సాహితీ ఉద్యమాల చరిత్రలు, సాహితీ వ్యాసాలు ఇంతవరకు వెలువరించిన ఇరవై గ్రంథాల ప్రచురణ ఎస్.వి. బహుముఖ ప్రజ్ఞాపాటవాలకు దర్పణం.
ఎస్వీ సాహితీ యశస్వి...

742
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles