కొనుగోలు నుంచి.. పిచికారీ వరకు

Thu,February 28, 2019 12:43 AM

paddy-spray
రాష్ట్రంలోని రైతులు తమకు ఉన్న నీటి వనరులను బట్టి ఈ యాసంగిలో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నా రు. ఈ పంటల నుంచి అధిక దిగుబడులను సాధించడం కోసం రైతులు ఇష్టం వచ్చిన రీతిలో రసాయన మందుల ను పిచికారీ చేస్తున్నారు. దీంతో పంటల దిగుబడిలో ఆయా మందుల అవశేషాలు మిగిలి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే మందులను పిచికారీ చేసేటప్పుడు సరియైన పద్ధతులు అవలంబించడంలేదు. దీంతో పిచికారీ చేసిన వారి అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పంటలలో సస్యరక్షణ కోసం పిచికారీ చేసే మందులు కొనుగోలు నుంచి పిచికారీ చేసే వరకు తగిన జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. సస్యరక్షణ మందుల వాడకం తీసుకోవాల్సి జాగ్రత్తలను గురించి వారు తెలిపిన వివరాలు...

పంటలకు ఏ తెగులు, ఏ పురుగు సోకిందో గుర్తించాలి. ఆయా తెగుళ్ళు, పురుగుల నివారణకు అవసరమైన మందులను నిపుణులు సిఫారసు చేసిన విధంగా తెచ్చుకోవాలి. ఏ సమయంలో పిచికారీ చేయాలో, ఏ రకమైన మందులను కలిపి వాడుకోవచ్చో ముందే స్పష్టంగా తెలుసుకోవాలి.

గుర్తింపు పొందిన కంపెనీల లేబుల్, సీళ్ళు సరిచూసుకోవాలి. సీసాలకు మూతలు బిగించిన తర్వాత వేసిన సీళ్ళను పరిశీలించాలి.

లైసెన్సు పొందిన దుకాణాల్లోనే మందులను కొనుగోలు చేయాలి. అవసరానికి మించి మందులను కొనుగోలు చేయవద్దు. చేసి మందులను ఇంటి వద్ద నిల్వ చేయడం క్షేమం కాదు. పురుగు మందులను ఎక్కువ కాలం నిల్వ చేస్తే వాటి సామర్థ్యం తగ్గిపోతుంది. కొనుగోలు చేసేటప్పుడు వాటి తయారీ తేదీని చూసుకోవాలి.

తెగుళ్ళు, పురుగు మందుల పనితీరు వేరుగా ఉంటుం ది. వాటిని కలిపి వాడేటప్పుడు ఏ మందులో ఏది కలి స్తే సమర్థవంతంగా పని చేస్తుందో సూచించిన ప్రకారం వాడుకోవాలి. విచక్షణారహితంగా అన్నిరకాల మందులను కలిపి పిచికారీ చేయకూడదు.

పిచికారీ చేసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

-పురుగు మందులు వాసన చూడకూడదు.
-పురుగు మందులు పిచికారీ చేసే సమయంలో ఆహార పదార్థాలు తినడం, నీరుతాగడం, చుట్ట సిగరెట్ కాల్చడం వంటివి చేయకూడదు.
-పొడి మందులు ఉదయం 9 గంటలలోపు, సాయం త్రం నాలుగు గంటల తర్వాతనే పిచికారీ చేయాలి.
-మందులు పిచికారీ చేసేందుకు వాడే పరికరాలకు రంధ్రాలు లేకుండా జాగ్రత్తలు పడాలి.
-మందులు పిచికారీ చేయడం పూర్తి అయిన తర్వాత శుభ్రంగా స్నానం చేయాలి.
-సీసా మూతలను నోటితో తీయడం, బకెట్లలో మందులను చేతులతో కలుపడం వంటివి చేయకూడదు.
-నీటిలో కరిగే పొడి మందులను ఒకేసారి నీటిలో పోసి కలుపకూడదు. మొత్తం మందు పొడిని కొద్ది నీటిలో పోసి కర్రతో కలిపిన తర్వాత మరికొంత నీరుపోసి పలుచగా చేసి ఆ తర్వాత నిర్ణీత మొత్తం నీటిలో కలుపాలి.
-మబ్బులు పట్టి జల్లులు పడే సమయంలో, ఎండ తీవ్ర త ఎక్కువగా ఉన్నప్పుడు సస్యరక్షణ మందులు చల్లకూడదు. గాలి వీచే వైపు చలాల్లి. పంటపొలాల్లో గాలికి ఎదురుగా పిచికారీ చేయకూడదు.
-పిచికారీ చేసే సమయంలో మాస్కులు, గమ్‌బూట్లను, రబ్బరు గ్లౌజులను, పొడవు చేతి చొక్కాలను తలకు, నోటికి, ముక్కుకు కట్టుకునే వస్ర్తాలను ధరించాలి.
-ఖాళీ మందు సీసాలను, డబ్బాలను కడిగి వాడవద్దు. వాటిని పాతి పెట్టాలి. మందులు పిచికారీ చేసిన తర్వా త కనీసం వారం, పది రోజుల వరకు పంటను కోయకూడదు
-నట్టె కోటేశ్వర్‌రావు, 9989944945
గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా

జాగ్రత్తలతో ప్రమాదాలను అరికట్టవచ్చు

పంటలలో అధిక దిగుబడులు సాధించాల న్న ఆశతో రైతులు రసాయన మందులను ఇష్టం వచ్చినట్లు పిచికారీ చేయడం సరికా దు. వచ్చిన రోగ లక్షణాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత రోగాన్ని నిర్ధారించుకుని దానికి అవసరమైన మందులను మాత్రమే కొనుగోలు చేసి తగిన మోతాదులోనే పిచికారీ చేయాలి. పిచికారీ చేసేటప్పుడు గాలి ఎదురుగా మందులను పిచికారీ చేయకూడదు. మబ్బులు పట్టినప్పుడు, ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు పిచికారీ చేయడం సరికాదు. తగు జాగ్రత్తలు పాటిస్తూ మందులను పిచికారీ చేస్తే ప్రమాదాలను అరికట్టవచ్చు. అలాగే పంట చేలపై రోగాల ప్రభావం సైతం తగ్గిపోయి ఆశించిన దిగుబడులను పొందవచ్చు.
yadagiri-reddy
- టి.యాదగిరిరెడ్డి, 9440481279
కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి

684
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles