పురుగుల నివారణ

Thu,September 13, 2018 01:18 AM

జూన్ మొదటి వారంలో వేసిన చామంతి, బంతి, ఆస్ట్రల్ పూల తోటలు ప్రస్తుతం మొగ్గ దశలో ఉంటాయి. కాస్త ముందుగా వేసిన పూలు కోత దశలో ఉంటాయి. రైతులు ఈ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి. పంటను కాపాడటంలో ఇన్నాళ్లు ఒకెత్తయితే.. ఇప్పుడు ఒకెత్తు.
Chamanthi
-దీపావళి పండుగలు వస్తుండటంతో పూలకు ధరలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది.. పూలు కాస్త వెడల్పుగా.. నిగనిగలాడుతూ ఉంటే మార్కెట్లో ఇతర పూల కన్నా అధిక ధర పలుకుతుంది. కావున రైతులు కొద్ది పాటి సస్యరక్షణ చర్యలు పాటిస్తే పంట ను కాపాడుకోవచ్చు. అధిక దిగుబడి.. అధిక లాభం పొందొచ్చు.
-మొగ్గ, పూలు కాసే దశలో కాయ తొలు చు పురుగు ఉధృతి అధికంగా ఉంటుంది. దీనికి గుర్తించి వెంటనే నివారణ మందులు పిచికారీ చేసుకోవాలి.. పచ్చ పురుగు/రబ్బర్ పురుగు నివారణకు అసిఫేట్, సైపర్ మెత్రిన్ మందులే వాడాలి. నల్లదోమ, తెల్లదోమ కూడా కనిపిస్తుంది.. వీటి నివారణకు ఎసిఫేట్ లీటరు నీటికి 2 మి.మీ కలిపి పిచికారీ చేస్తే సరిపోతుంది. మొక్కలు పెరిగే దశ నుంచే వేపనూనె, గానుగ నూనె లాంటి కషాయాలు వాడితే క్రిమి సంహారక మందుల అవసరం పెద్దగా పట్టదు.
-అలాగే ఆకులు పసుపుపచ్చగా మారడం, నలుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణకు మల్టీ ఫీడ్ మందు వాడాలి. దీంతో పాటు డైథేం ఎం-45 వాడితే శిలీంధ్రాలు అదుపులో ఉంటాయి.
Bhanti
-ఎక్కువ రోగం వచ్చిన (మొత్త పసుపు పచ్చగా, నలుపు రంగులోకి) మొక్కలను పీకి వేయాలి..
-ఎదుగని మొక్కలను కూడా చేనులోంచి తొలిగించాలి.
-నీళ్లు తడులు కూడా నల్లరేగడి భూముల్లో అయితే ఐదురోజులకు ఎర్రనేలల్లో మూడు రోజులకు ఒకసారి పెట్టుకోవాలి.
-మొక్కళ్ల మొదళ్ల వద్ద గడ్డి మొక్కలు ఉండకుండా చేసుకోవాలి..
-మొగ్గలు, పూలకు సూర్యరశ్మీ తగిలేలా చూసుకోవాలి.. ఆకుల కిందకు మొగ్గలు ఉంటే ఎండ తగిలేలా సరిచేయాలి.. అప్పుడే పూలు పెద్దవిగా పూస్తాయి..
-పూలు తెంపే సమయంలో తేలిక పాటి గంపలు లేదా పెట్టేలు వాడాలి.. కాళ్లకు చెప్పులు వేసుకోవద్దు.. కొమ్మలు విరిగే ప్రమాదముంటుంది.. వేర్లను చూస్తూ అడుగులు వేయాలి..
-పూలు తెంపిన వెంటనే నీడలో ఆరబోయా లి.. రాత్రి సమయంలో పలుచగా నేర్పి సన్నగా నీళ్లు చిలకరించాలి.. ఇలా చేస్తే నిగనిగలాడు తూ ఉంటాయి. బంతి పూలు, తెల్ల చామంతికి అవసరం లేదు..
-జూకంటి నరేందర్
ASTRAL

989
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles