ఎన్నికల్లో ధన ప్రభావాన్ని అరికట్టాలె


Fri,November 8, 2019 01:13 AM

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో మున్సిప ల్ ఎన్నికలకు సంబంధించి ప్రకటన వెలువ డటంతో ఎన్నికల కోలాహలం ప్రారంభ మైంది. అప్పుడే అభ్యర్థులుగా ప్రకటించు కుంటున్నవారు ఇంటింటి ప్రచారం మొద లుపెట్టారు. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థు లు ఖరారు కాకున్నా ప్రచారం మాత్రం జోరుగా సాగుతున్నది. ఇదే సందర్భంలో ఈసారి ధన ప్రభావం ఎక్కువగా ఉండే పరి స్థితి కనిపిస్తున్నది. అప్పుడే పోటీదారులు అనుచరులకు మద్యం పంపకాలు ప్రారం భించారు. అలాగే కుల సమీకరణలు జోరు గా సాగుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో పార్టీ కన్నా కులం, ధనం మాత్రమే నిర్ణయాత్మ కంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి ధోరణులు ప్రజాస్వామ్యాన్ని హాస్యాస్పదం చేస్తాయి.
- చుంచు అరుణ్‌కుమార్, వెల్గనూర్, మంచిర్యాల


భూ సమస్యలు పరిష్కరించాలె

భూ వివాద విషయంలో జరిగిన సజీవ దహనం ఘటనలో తహశీల్దార్ విజయారెడ్డి, ఆమె డ్రైవర్ గురునాథం ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో నిందితుడైన కూర సురేష్ కూడా మృతి చెందాడు. భూ వివాదంలో ఆఫీసుల చుట్టు తిరిగి వేసారిపోయిన సురేష్ తన కోపాన్ని అణిచివేసుకోలేకపోయాడు. కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని తానేం చేయలేనని చెప్పిన విజయారెడ్డిపై కక్షతో దాడి చేశాడు. అగ్నికి ఆహుతవుతున్న తమ అధికారిణిని కాపాడాలనే తాపత్రయంతో తను కూడా తనువు చాలించాడు డ్రైవర్ గురునాథం. అదే దాడిలో తీవ్రగాయా లపాలైన సురేష్ కూడా చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఈ ఘట న మొత్తంగా చూస్తే భూ సమస్య వల్ల మూడు అమాయక ప్రాణాలు గాల్లో కలిశాయి. ఏ వ్యక్తి అయినా తనకు సంబంధించిన భూమిని వదు లుకోవ డానికి ఇష్టపడడు. దానికోసం ఎంతదాకా అయినా పోరాడుతా డు. కాబట్టి ఈ విషయంలో రెవెన్యూ అధికారులు బాధ్యతగా వ్యవహరిస్తే మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ అసలుదారులకు అన్యాయం జరుగకూడ దు. కాబట్టి ఏ చిన్న భూ సమస్యయినా మూలాల నుంచి పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలి. ఇలా చేస్తేనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూ సమస్యలు పరిష్కారమవుతాయి.
- జవ్వాజి సుధాకర్, కురిక్యాల, కరీంనగర్ జిల్లా

65
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles