ఫిట్ ఇండియా సాధ్యమయ్యేనా?


Fri,November 1, 2019 02:02 AM

ప్రధాని మోదీ ఫిట్ ఇండియా పిలుపుని చ్చిన నేపథ్యంలో దేశ ఆరోగ్య పరిస్థితిని అవలోకించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుతం షుగర్, బీపీ రోగులతో దేశం మానవ వనరులను బలహీనం చేసుకుం టున్నది. శారీరక శ్రమ లేని జీవనశైలి, మానసిక ఆందోళనలు ప్రజలను రోగాల బారినపడేలా చేస్తున్నాయి. కాబట్టి పాఠ శాలస్థాయి నుంచి ఆటపాటలు విద్య, యోగా వంటి వంటివి భాగం చేస్తే ముం దు తరాల వారైనా ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం ఉన్నది. తల్లిదండ్రులు, ఉపాధ్యా యులు చదువుకు ఇచ్చే ప్రాముఖ్యంలో భాగంగా ఆటలు, యోగా, శారీరక, మాన సిక వికాసానికి దోహదం చేసే అంశాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ఫిట్ ఇండియా సాధ్యమవుతుంది.
- సుగంధ శ్రీనివాస్, జమ్మికుంట


సమ్మె విరమించాలె

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా రు. తమ కోరికలు ఎంత న్యాయమైనవి అయినా ప్రభుత్వంతో సామరస్య పూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరించుకుంటే బాగుండేది. పంతానికి పోయి సమ్మెకు దిగటం మూలంగా ప్రజలకు ఇబ్బందులు ఏర్పడటమే గాక, ఆర్టీసీకి ఎంతో నష్టం వాటిల్లుతున్నది. ఇప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీని మరింత నష్టాలపాలు చేయటం ఆర్టీసీ నేతలకు తగదు. ప్రజల కష్టాలు, ఆర్టీసీ భవితవ్వం దృష్ట్యానైనా సమ్మెను విరమించి ప్రజలకు సహకరించాలి.
- కాచరాజు జయప్రకాశ్, భువనగిరి

పూర్తిస్థాయిలో నివారించాలె

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు డెంగీ వ్యాధితో మరణించ డం బాధాకరం. ఆ వ్యాధి ప్రభావం లేదనుకుంటున్న సమయంలో డెంగీ వ్యాధి విజృంభించడం ఆందోళనకరం. కాబట్టి డెంగీ వ్యాధిని మూలాల నుంచి మట్టుబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పరిసరాలు పరిశుభ్రం గా ఉం చుకున్నప్పుడే దోమలను నివారించడం సాధ్యమవుతుంది. కాబట్టి అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.
-పెంచాల తిరుపతి, తాహెర్ కొండాపూర్, కరీంనగర్

98
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles