మద్యాన్ని నియంత్రించాలె


Thu,October 31, 2019 12:15 AM

రాష్ట్రంలో మద్యం కారణంగా తలెత్తుతున్న సామాజిక సమస్యలు అనేకం. కష్టజీవులైన పేదలు తమ కష్టార్జితా న్ని ఎక్కువభాగం తాగడం కోసమే ఖర్చుచేస్తున్న దుస్థితి ఉన్నది. అంతటితో ఆగకుండా కుటుంబంలో అనేక సమస్యలకు మద్యమే కారణమవుతున్నది. కాబట్టి ఎన్నో సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న కేసీఆర్ ప్రభుత్వం మద్యం అమ్మకాల విషయంలోనూ కొంత నియంత్రణ ఉండేట్లు చర్యలు తీసుకోవాలి. మారుమూల పల్లెల్లో కూడా మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దీంతో ఎంతో మద్యానికి బానిసలై ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని కష్టాల పాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా బెల్ట్ షాపులను, విచ్చలవిడి మద్యం అమ్మకాలను కట్టడి చేయాలి. మద్యాన్ని కనిష్టంగా అందుబాటులో ఉంచినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించి తగు చర్యలు తీసుకోవాలి. అప్పు డే పేదల జీవితాలు సక్రమంగా సాగుతాయి.
- బ్రహ్మం విశ్వకర్మ, వీవర్స్ కాలనీ, కొత్తకోట, వనపర్తిజిల్లా


స్ఫూర్తినింపిన ఫలితాలు

ఈ మధ్య ప్రకటించిన గ్రూప్-2 ఫలితాల్లో ఎంతో మం ది తెలంగాణ గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులు డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగాలు సాధించటం యువత లో స్ఫూర్తినింపింది. ఇప్పటిదాకా ఇలాంటి ఉద్యోగాలు ఎవరికో ఉన్నతవర్గాలకు చెందినవారికే, నగరాల్లోని కులీ న వర్గాల వారికే దక్కుతాయనే అపోహ ఉండేది. కానీ మొన్న ప్రకటించిన గ్రూప్-2 ఫలితాలు పట్టుదలతో చది వితే సాధించలేనివి ఏమీ లేవని చాటిచెప్పాయి. యాదా ద్రి భువనగిరి జిల్లా సుంకిశాల గ్రామానికి చెందిన పైళ్ల నవీన్‌రెడ్డి దంపతులిద్దరికీ డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగా లు రావటం జిల్లాతో పాటు రాష్ర్టానికంతటికీ స్ఫూర్తిదా యకంగా నిలిచింది. ఈ స్ఫూర్తితో గ్రామీణ యువత నిబ ద్ధతతో చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవ్వాలి. మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాల కోసం పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. అవి ఒక్కొక్కటిగా నెరవేరుతుండటం ఆనందదాయకం.
- పి.మహేందర్ రెడ్డి, హైదరాబాద్

132
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles