మంటగలుస్తున్న మానవత్వం


Wed,October 30, 2019 01:28 AM

ప్రవర్తన మార్చుకోమన్నందుకు కూతురే కన్న తల్లిని కడతేర్చిన ఉదంతం సమాజా న్ని కలవరపరుస్తున్నది. అలాగే మరోచోట కన్నతల్లే తన ఇద్దరు బిడ్డలను గొంతుకోసి చంపి, తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన దిగ్భ్రాంతికి గురిచేసేది. ఇలాంటి ఘటనలు ఈ మధ్యకాలంలో పరిపాటి అయిపోయాయి. వీటికి వ్యక్తుల్లో ని చెడుకు మాత్రమే ఆపాదించి చూస్తే పరి ష్కారం లభించదేమో. ఇలాంటి దారుణాల వెనుక కనిపించకుండా సమాజాన్ని అమా నవీయం, నిర్వీర్యం చేస్తున్న విష సంస్కృ తి కారణం. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లు విరి విగా వినియోగంలోకి వచ్చిన తర్వాత మనుషుల్లోని మానవీయత ఆవిరైపోతున్న ది. దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలె. పరిష్కారమార్గాలు వెతుకాలె.
-కొత్వాల్ ప్రవీణ్, బేగంపేట, హైదరాబాద్


నిర్లక్ష్యం వీడాలె

బోరుబావుల్లో పడి చిన్నారులు మృతి చెందుతున్న వార్తలు యావత్ దేశప్రజలను కంటతడి పెట్టిస్తున్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యాల వల్లే ఇలాంటి ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. అభం శుభం తెలియని పసిపిల్లలు అసువులు బాస్తున్నారు. కన్నవారికి కడుపు శోకం మిగులుతు న్నది. బోరు బావులు తవ్వించినప్పుడు ఆ బావిలో నీళ్లు పడకపోతే మళ్లీ ఆ బావిని పూడ్చాల్సిన బాధ్యత ఆ బావి యాజమానులపై ఉంటుంది. కానీ యాజమానులు బావులను పూడ్చివేయడం లేదు. దీంతో పసిపిల్లలు బోరుబావుల్లో పడుతూ మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నా బోరుబావుల యాజమానుల్లో మార్పు రావ డం లేదు. ఇటీవల తమిళనాడులోని తిరుచ్చిలో బోరుబావిలో పడిన బాలుడు సుజిత్‌ను ప్రాణాలతో బయటకు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభు త్వంతో పాటు, కేంద్రం కూడా చాలా ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం జర్మనీ టెక్నాలజీని కూడా ఉపయోగించింది. అయినా సుజిత్ తల్లికి గర్భశోకం తప్పలేదు. సినీనటులు మొదలు దేశ ప్రధాని వరకు బాలుడిని ప్రాణాలతో బయటకు తీసుకురావాలని చేసిన ప్రయత్నాలకు ఫలితం లేకుండా పోయింది. కాబట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.
- నర్మాల కృష్ణతేజ, లక్ష్మీనగర్, కరీంనగర్

136
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles