హర్షణీయం


Tue,October 29, 2019 12:29 AM

మున్సిపాలిటీలలో 15 రోజుల ప్రణాళికను ప్రారంభించడం ఆహ్వానించదగిన పరిణా మం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రారంభించిన 30 రోజుల ప్రణాళికతో గ్రామాల్లో మౌలిక వసతుల రూపకల్పన జరిగినట్లు మున్సిపాలిటీలలో కూడా జరుగుతాయని ప్రజలు భావిస్తున్నారు. ఈ 15 రోజుల ప్రణాళికలో ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ బాగుపడుతుందని పట్టణ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సైతం మున్సిపాలిటీలలో మౌలిక వసతుల రూపకల్పనకు అధిక నిధులు కేటాయించవలసిన అవసరం ఉన్నది. ప్రతి మున్సిపాలిటీలో డంపింగ్‌యార్డులు ఏర్పాటుచేయాలి. మున్సిపాలిటీలు అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించ డం హర్షించదగిన పరిణామం.
- షేక్‌ అస్లాం షరీఫ్‌, శాంతినగర్‌


రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం కఠినమై న నిబంధనలు తీసుకుంటున్నప్పటికీ రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గకపో వడం బాధాకరం. రోజూ ఎక్కడోచోట ప్రమాదాలు జరుగుతూ పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలె. ప్రమాదాల నివా రణ కోసం అధికారులతో పాటు ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించిన ప్పుడే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుంది.
- ఎస్‌.వెంకటాచారి, ఆదిలాబాద్‌

రైతులను ఆదుకోవాలె

రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలన్నీ నేల పాలయినాయి. వరి, పత్తి వంటి పంటలు వానలో తడిసి రైతులకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నేల మట్టం కావడంతో రైతులు బాధపడుతున్నారు. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపక్షాన నిలువాలి. రైతులకు నష్టపరిహారం చెల్లిం చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది.
- బోడపట్ల కిషన్‌, కురిక్యాల, కరీంనగర్‌

96
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles