ప్లాస్టిక్‌ విలాపం


Thu,October 3, 2019 11:49 PM

అన్నింటిలో నేనే.. అన్నింటికీ నేనే
అడుగడుగునా వాడేది నన్నే
అవసరానికి మించి అభివృద్ధి చేసిందీ నన్నే
అంతటా నేనని ఆడిపోసుకునేది నన్నే
మనిషి అద్భుత సృష్టికి నమూనాను నేనే
ప్రతి సృష్టికి వాడేది నన్నే
మానవ మనుగడలో మమేకమైంది నేనే
ప్రకృతికి పగవాడినైపోతున్నది నేనే
దాచుకోవటానికి నేనే
దాపు కోసం నేనే
ఎండ నుండి కాపాడటానికి నేనే
వాన నుంచి రక్షణకు నేనే
గ్రాము బరువైన లేని నేను
కిలోల బరువును మోస్తున్నాను
నన్ను మీకు నచ్చినట్లుగా
రంగురంగుల రంగవల్లిగా
అతిపలుచగా సాగదీస్తారు
అంతటా అక్కరకు రావాలంటారు
నా సాగే గుణాన్ని సాకుగా చేసుకొని
నచ్చినట్లుగా నన్ను మలుచుకొని
ఒక్కసారి వాడి ఆవల పడేస్తున్నారు
ముప్పును కొని తెచ్చుకుంటున్నారు
మనిషికి ఎంతో ఉపయోగపడుతున్నా
మానవ తప్పిదాలతో అపవాదు మోస్తున్నా
నన్ను ధరిత్రికి శత్రువుగా మారుస్తున్నది మానవాళి!
మీకు చేస్తున్న సేవకు ఇదేనా మీ నివాళి!
నన్ను వాడి పడేయక చేరదీసి
నాలోని శక్తిని వేరు చేసి
మరలా వాడుకోవచ్చు కదా!
మీకు నా పట్ల ఉన్న ప్రేమ ఇదేనా!!
మీ నరజాతికి ఈ నీతి తగునా!!


- డాక్టర్‌ యన్‌.లింగయ్య

120
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles