అందాల బతుకమ్మ


Tue,October 1, 2019 01:01 AM

jana
అందాల బతుకమ్మ
తెలంగాణ బతుకమ్మ
సిన్నాపెద్దా వాళ్లంతా సేరి
సిగురుపూలు ఏరికోరి తెచ్చి పేర్చిన బతుకమ్మ
తెలంగాణ బతుకమ్మ


జాజిపూల జాతరతో సాగుతున్న బతుకమ్మ
రెల్లుపూల నవ్వులలో హరివిల్లులాంటి బతుకమ్మ
సందమామ ఎన్నెల్లో
సల్లసల్లని బతుకమ్మ
అందాల తెలంగాణలో సిన్నారి నవ్వుల బతుకమ్మ

తంగేడు పూలతోటి బంగారుకాంతుల తోటి
గునుగుపూల సందడుల తోటి
గుప్పుమనే సూరీడు నవ్వుల తోటి
మెరిసిపోయే బతుకమ్మ
మా అందాల బతుకమ్మ

అందసందాల బతుకమ్మ
సిందులేయు ఆడపడుచుల
పసుపుకుంకుమల బతుకమ్మ
సిన్నారి బతుకమ్మ.

- తిరునగరి శరత్‌చంద్ర
6309873682

125
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles