తీరొక్క పూల బతుకమ్మ


Fri,September 27, 2019 10:56 PM

Bathukamma-Festival
అడవిలోన తంగేడు విరగపూసింది
ఘనముగా గునుగంతా వనంలో వెలిసింది
అడవి పువ్వులన్ని అమ్మ తెచ్చింది
తీరొక్క పూలన్ని ఇంట్లో పరిచింది
చెల్లి పువ్వుల్ని కట్టగట్టి సాపలో పెట్టింది
అక్క గుమ్మడి ఆకుల్ని పరుగున తెచ్చింది
బామ్మ తాంబాలంలో బతుకమ్మ పేర్చింది
వాకిట్లో బతుకమ్మల గుంపు చేరింది
బతుకమ్మ ఆటపాట సంబురం చేసింది
చిన్నారుల కేరింతలు అంబరాన్ని తాకింది
కోలాట నృత్యం కనువిందు నింపింది
తొమ్మిదొద్దుల బతుకమ్మ జాతర చేసింది
ఒడిన చేర్చుకొని గంగమ్మ మురిసింది
గౌరమ్మ పాటతో వాయినం పంచింది
పల్లె పట్నమందు పర్వం నిలిపింది
పువ్వుల్ని పూజించే సంస్కృతి మనదంది
బతుకమ్మ వైభవం జగతంతా చాటింది
తెలంగాణ రాష్ర్టాన పూల వర్షం కురిసింది!
- ఉండ్రాల రాజేశం, 9966946084

129
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles