విడ్డూరంగా ఉన్నది

Fri,August 30, 2019 12:47 AM

రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్ష నేత లు ఉండటం దురదృష్టకరం. రాష్ట్ర రైతాంగానికి కరెంటు కష్టాలు తీర్చడానికి ప్రభుత్వంతో పాటు విద్యుత్ సిబ్బంది అహోరాత్రులు కృషి చేసింది. దాని ఫలితంగా తొలుత తొమ్మిది గంటలు ఇప్పుడు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటును అందిస్తున్నది. కానీ కొంతమంది నేతలకు ఇది మింగుడు పడటం లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై ఏ విమర్శలు చేయాలో పాలుపోక విద్యుత్ అంశాన్ని తెరమీదికి తెచ్చి దానిమీద అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధిత శాఖ అధికారులు వివరణ ఇచ్చిన తర్వా త కూడా ఇంకా కొంతమంది పనిగట్టుకుని ఈ విషయాన్ని తెరమీదికి తెచ్చి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయబూనడం క్షమార్హం కాదు. రైతుల కోసం ఎంతైనా ఖర్చు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు ప్రకటించింది. అయినా ఎన్నడూ రైతు సంక్షేమం పట్టని వారు తాజాగా రైతుల గురించి మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉన్నది.
- బి. రామాంజనేయులు, నాగార్జునసాగర్

భరోసా ఇచ్చిన ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నది. సాగు నీటి సౌకర్యం ఉంటే రైతు లు బాగుపడుతారు. అట్లనే వ్యవసాయ అనుబంధ వృత్తులకు కూడా మేలు జరుగుతుందని ప్రభుత్వం భావించిం ది. అందుకే అనేక వివాదాల్లో ఉన్న ప్రాజెక్టులను నేర్పుతో పరిష్కారం చేసుకుంటూ పూర్తిచేస్తున్నది. దీంతోపాటు చెరువుల పునరుద్ధరణ కూడా చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగంపై తీసుకుంటున్న చర్యల పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తమ కలలు నిజమౌతున్నాయని అంటున్నారు. ఇవ్వాల వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ వృత్తుల వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక భరోసా లభిస్తున్నది. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకుపోతుండటం కొందరికి నచ్చడం లేదు. ఏదో విధంగా రంద్రాన్వేషణతో తప్పులు వెదుకుతూ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల శ్రేయస్సు పరమావధిగా అందరూ ఆలోచిస్తే రాష్ర్టానికి మేలు.
- మంగళారపు సుభాష్‌రెడ్డి, గొల్నేపల్లి, వలిగొండ.

82
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles