హామీలు మరిచి అసత్యాలా?

Fri,August 9, 2019 01:25 AM

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేరుస్తామని బీజేపీ నాయకులు పదేపదే ప్రకటనలు ఇస్తుంటారు. కానీ గడిచిన ఐదేండ్ల కాలంలో ఇప్పటికీ అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. వాటి గురించి ఎన్నడూ వారు పట్టించుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంపై మాత్రం తమ అక్కసును అవసరం వచ్చినప్పు డల్లా వెళ్లగక్కుతూనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావమే ఒప్పందాల ప్రాతిపదికన ఏర్పడింది. నాడు విలీ న సమయంలో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించిన ఫలితమే తెలంగాణ రాష్ట్ర పోరాటం దశాబ్దాల పాటు జరిగింది. ఈ విషయం తెలియకుండా బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చట్టసభల్లోనూ, బైట అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఇటీవలి పార్లమెంట్ సమా వేశాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం అవాకులు చెవాకు లు పేల్చే తెలంగాణ బీజేపీ నేతలు అమిత్ షా వ్యాఖ్యలపై మాత్రం మౌనం వహించటం సిగ్గుచేటు. జమ్ముకశ్మీర్‌లో 370, 35 ఏ ఆర్టికల్‌ను రద్దుచేయడం మూలంగా దేశం లో దుమారం రేగింది.

దీన్ని ఆసరాగా చేసుకున్న కాంగ్రె స్ నాయకులు బీజేపీని ఎండగట్టారు. పార్లమెంట్‌లో పర స్పరం దూషించుకున్నారు కూడా. ఇదిలా ఉంటే తెలంగా ణ ఏర్పాటును అమిత్ షా వాడుకోవడం విడ్డూరం. తెలంగాణ రాష్ట్రం అనేక పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడింది. కొత్త రాష్ట్రమైనా అనేక సమస్యలు అధిగమి స్తూ ప్రగతిపథంలో పయనిస్తున్నది. అలాంటి రాష్ర్టానికి విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కేంద్రానికి ఇక్కడి ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదు. రెండోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ విభజన సమస్యల పరిష్కారం కోసం కేంద్రంలోని పెద్దలు ఏ మాత్రం కృషిచేయ డం లేదు. కానీ ఏపీ విభజనపై అసత్యాలతో కూడిన వ్యాఖ్యలు చేయడం వీళ్లకు పరిపాటిగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు వెనక్కితీసుకోవాలి. రాష్ర్టాభివృద్ధి కోసం కేంద్రం తన వం తు సాయం చేయాలి. అప్పుడే ఇక్కడి ప్రజల మన్ననలు పొందుతారు.
- ఎర్ర సైదులు, వలిగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా

143
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles