సంయమనం అవసరం

Sat,August 3, 2019 01:26 AM

ఆందోళనల సమయంలో పోలీసులు ఎం తో ఓపికతో వ్యవహరించాలి. ఆందోళన కార్యక్రమాల్లో ఆయా వర్గాలు తమవైన డిమాండ్లతో చేసేటప్పుడు ఒక విధమైన ఆగ్రహావేశాలతో ఉంటారు. అలాంటి వారి తో వ్యవహరించేటప్పుడు పోలీసులు నేర్పుతో, ఓపికతో వ్యవహరించాలి. ముఖ్యంగా మహిళలు ఆందోళనా కార్యక్ర మాల్లో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకుంటే ఈ మధ్య వైద్య విద్యార్థుల విషయంలో జరిగిన పొరపాటు జరుగటానికి అవకాశం ఉంటుంది. మహి ళా అందోళనకారుల విషయంలో మహిళా పోలీసులనే వినియోగిస్తే మంచిది. ఏ మాత్రం మితిమీరినా ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు అర్థమే ఉండదు. ఇదొక గుణపాఠంగా తీసుకొని పోలీస్ వ్యవస్థ నడుచుకోవాలె.
- విష్ణు, హయత్‌నగర్, హైదరాబాద్

అప్రమత్తత అవసరం

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసుర్లతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది. మరోవైపు అన్ని దవాఖానల్లో జూనియర్ వైద్యులు నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. కాబట్టి జ్వరాలతో దవాఖానలకు వచ్చే రోగు లకు సత్వర వైద్యం అందేట్లు చర్యలు తీసుకోవాలె. వైద్య సిబ్బంది అం తా అప్రమత్తంగా ఉంటే మంచిది.
- బేగరి ప్రవీణ్‌కుమార్, అంతారం, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా

మొక్కలు నాటాలె

రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పల్లె మొదలు పట్ట ణం దాకా అంతటా ఇదే అదనుగా మొక్కలు నాటడం పెద్ద కార్యక్రమం గా చేపట్టాలె. ప్రభుత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా ఎప్పుడో చేపట్టే బదులు ఇప్పుడు కురుస్తున్న వానలను మొక్కలు నాటడానికి అనువైన పరిస్థితిగా వినియోగించుకోవాలె. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలె. మొక్కలు నాటేటప్పుడు సంప్రదాయ వృక్షాలైన వేప,రావి, మర్రి చెట్లతో పాటు పల్లె కు పచ్చదనాన్ని ఇచ్చే కానుగ, పండ్ల చెట్లను కూడా నాటాలె.
- ఎర్ర సైదులు, వలిగొండ, భువనగిరి యాదాద్రి జిల్లా

131
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles