అవగాహన కల్పించాలె

Fri,August 2, 2019 01:17 AM

అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ఎంత గొప్పదో శరీరంలో ని అవయవ దానం అంతకన్నా గొప్పది. ఎంతో మంది తమకు అవసరమైన అవయవాలు అందుబాటులో లేక అకాల మరణం చెందుతున్న దుస్థితి ఉన్నది. ప్రజల్లో చైతనం ఉంటే ఇలాంటి సమస్యను అధిగమించటం సుల భమే. అవయవదానం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించ టం ద్వారా ఎంతో మందికి పునర్జీవితం కల్పించవచ్చు. వాస్తవానికి అవయవ దానం చేయాలంటే బతికి ఉండగా నే చేయాల్సిన పనిలేదు. ఏదైనా ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్ అయి కొంతమంది చనిపోతూ ఉంటారు. ఇలాంటివారి అవయవాలు ఆరోగ్యంగా, సజీవంగా ఉండి అవయవాల కొరతతో ఏండ్లకేండ్లుగా బాధపడుతున్న వారికి ఎంతగానో ఉపయోగపడుతాయి. బ్రెయిన్‌డెడ్ అయినవారి అవయ వాలు మరికొందరికి జీవం పోస్తాయి. సాధారణ మరణం చెందినవారి అవయవాలు కూడా ఒక్కో సందర్భంలో ఉప యోగపడుతాయనే విషయం కొందరికి తెలియక అవయ వ దానం చేసేందుకు వెనుకడుగు వేస్తారు. ఇదిలా ఉం టే కిడ్నీలు ఫెయిల్ అయి డయాబెటీస్‌తో జీవిస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి కిడ్నీ బాధితులకు అవస రమైన కిడ్నీలు అందుబాటులో ఉండకపోవడంతో ఏండ్ల కేండ్లుగా డయాలిసిస్‌పై ఆధారపడి జీవనం కొనసాగిస్తు న్నారు. దీంతోపాటు ఒక్కో సందర్భంలో కనీసం కుటుంబ సభ్యులు కూడా ఒక కిడ్నీ ఇచ్చేందుకు ముందుకురాకపో వటం శోచనీయం.

ఇదిలా ఉంటే శరీరదానంపై కూడా ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం బాధాకరం. మర ణానంతర సంప్రదాయాల పేరుతో కొందరు శరీరదానా నికి వెనుకడుగు వేస్తారు. శరీరదానం వైద్య విద్యార్థులు పాఠాలు నేర్చుకునేందుకు ఉపయోగపడుతుంది. మూఢ నమ్మకాలతో అవయవ, శరీరదానాల వెనుకడుగు వేయ కుండా ఉంటే మరెందరికో జీవనం ఇచ్చిన వారమవుతా మన్న ఆలోచన గొప్పది. ఒకరు చనిపోతూ మరి కొందరికి ప్రాణదానం చేయటం ఎంతో ఉదాత్తమైనది. కాబట్టి శరీర, అవయవ దానాలపై అవగాహన పెంచు కోవాలె. ప్రభుత్వాలు కూడా దీనికోసం ప్రచార, ప్రసార మాధ్యమాలను వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్న ది. గ్రామాల నుంచి పట్టణాల దాకా విరివిగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయాలి. దీంట్లో సామాజిక కార్యకర్తలు ముందుండాలి. ఒక జీవితం ముగిసినా మరికొన్ని జీవితాలను నిలుపడం ద్వారా పునర్జీవితం పొందటం అనుసరణీయం,ఆదర్శం.
- నర్మాల కృష్ణతేజ, లక్ష్మీనగర్, కరీంనగర్

138
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles