బీసీసీఐ మేల్కోవాలె

Fri,July 12, 2019 01:46 AM

మూడోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలనుకున్న భారత క్రికెట్ జట్టు కలలు సెమీస్‌లోనే ఆవిరైపోయాయి. ఈసారి ఎలాగైనా ప్రపంచకప్ గెలిచితీరుతామని ఆడంబర ప్రకట నలు చేసిన క్రికెటర్లు పసికూనలైన న్యూజీలాండ్ చేతిలో ఘోర పరాజయం పొందడం కోట్లాది భారత క్రికెట్ అభి మానులు జీర్ణించుకోలేకపోతున్నారు. లీగ్ స్థాయిలో ఆఫ్గని స్తాన్, బంగ్లాదేశ్ చేతిలో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందాన గెలిచిన భారత జట్టుకు నిపుణులు అప్పుడే ప్రమాద ఘంటికలు మోగించినా దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. జట్టు నాయకుడు కోహ్లీతో పాటు మేనేజ్ మెంట్ కూడా తీవ్ర నిర్లక్ష్యం వహించింది. సెమీస్‌లో న్యూజిలాండ్‌తో తుదిజట్టు కూర్పులో షమీని తీసుకోకపో వడం, వరుసగా విఫలమౌతున్న చాహల్, దినేశ్ కార్తీక్‌ల ను తీసుకోవడమే పెద్ద తప్పు. ఇక న్యూజీలాండ్‌ను 240 పరుగులకే కట్టుదిట్టం చేసినా అనిశ్చితిగా ఉన్న పిచ్‌పై టాప్ ఆర్డర్ బ్యాట్‌మెన్లు నిర్లక్ష్యంగా ఆడారు. బలవంతం గా 221 పరుగులు చేసి ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే ఆలౌట్ కావడం పట్ల ప్రతి భారత అభిమాని నిరుత్సాహానికి గురయ్యాడు.

అంతకుముందు మ్యాచ్‌లో సెంచరీ సాధించిన కె.ఎల్.రాహుల్‌లో ఆత్మవిశ్వాసం అనే ది మచ్చుకైనా కనిపించలేదు. టాప్ ఆర్డర్ విఫలమైనప్పు డు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌లు మ్యాచ్ చేతుల్లోకి తీసుకో వాలి, కానీ మొన్నటి మ్యాచ్‌లో అది జరుగలేదు. నాలుగు వికెట్లు పడ్డాక ఎక్కువసేపు ఆడి పరుగులు రాబట్టగల ధోనీ కి బదులు రిషబ్‌పంత్‌ను పంపడం కూడా మరొక పెద్ద తప్పు. ముఖ్యమైన పోటీలో ఇటువంటి వ్యూహాత్మక తప్పి దాలను చేయడంపై జట్టు సారథి విరాట్ కోహ్లీనే పూర్తి బాధ్యత వహించాలి. ప్రపంచకప్ ముందు ముఖ్యమైన ఆటగాళ్ళు ఐపీఎల్‌లో ఆడటం మంచిదికాదని అనేకమం ది మాజీ ఆటగాళ్లు హెచ్చరించినా బీసీసీఐ పట్టిం చుకోలే దు. కాసుల వేటలో సర్వశక్తులు ధారపోసిన మన ఘనమై న ఆటగాళ్లు ప్రపంచకప్ పోటీకి వచ్చేసరికి నీరుగారిపో యారు. పెద్ద పోటీలలో ఆత్మైస్థెర్యం, పోరాడే తత్వం మొదటినుంచి కనబరుచకపోయారు. ఓటమిపై స్పంది స్తూ విరాట్ కోహ్లీ కాలం కలిసిరాలేదని చిన్నపిల్లాడిలా మాట్లాడటం అతని బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తు న్నది. ఇప్పటికైనా బీసీసీఐ మేల్కోవాలి.
- సి.సాయిప్రతాప్, ఏఎస్‌రావునగర్, హైదరాబాద్

88
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles