చర్యలు తీసుకోవాలె

Thu,July 11, 2019 12:10 AM

కొన్ని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వారు కాలం చెల్లిన బస్సులను వాడుతూ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ విషయమై తల్లిదండ్రులు, రవాణా శాఖ ధికారులు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఫిట్‌నెస్ లేని వాహనాల్లో విద్యార్థుల ప్రయాణం క్షేమకరం కాదు. ఎప్పుడు, ఏ రీతిలో ప్రమాదం ఎదురవు తుందో తెలియని పరిస్థితి దాపురిస్తుంది. జరుగాల్సిన నష్టం జరిగినాక బాధపడితే లాభమేమి ఉండదని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు, తల్లిదండ్రులు, రవాణా శాఖాధికారులు తెలుసుకోవాలి. ఫిట్‌నెస్ ఉన్న బస్సులనే వినియోగించేట్లు చూడాలి. కాబట్టి కాలం చెల్లిన వాహనాలను సీజ్ చేసి స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి.
- పుట్ట గణేష్, బేగంపేట, హైదరాబాద్

ఐక్యతగా ఉండాలె

బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు బీసీలు పోరాటాలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు బీసీ సమస్యలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నది. సుమారు యాభై శాతా నికి పైగా బీసీలు ఉన్నా, బీసీల్లో ఐక్యత లేక అనేక సమస్యలు అలాగే ఉం టున్నాయి. జనాభాలో సగభాగమున్న అధికారంలో వాటా లభించటం లేదు. బీసీలు ఐక్యతగా ఉంటేనే రిజర్వేషన్లు సాధించుకోవడంతో పాటు అధికారం దిశగా అడుగులు వేస్తాం.
- బైరి జనార్దన్, ప్రగతినగర్, హైదరాబాద్

చట్టాలను సవరించాలె

పసిపిల్లలపై అత్యాచారాలు, యువతలపై కత్తుల దాడులు పెరుగుతుండ టం హేయనీయం. ఆకృత్యాలకు పాల్పడుతున్న వారికి కఠినంగా శిక్షలు విధించాలె. అలాగే నేరాలకు కారణమైన విశృంఖల సాంస్కృతిక మూలా లను పెకిలించాలె. అశ్లీల, విశృంఖల సైట్లను కట్టడి చేయటానికి మన చట్టాలు అనుగుణంగా లేకపోతే వెంటనే సవరించాలి. అప్పుడే ఇలాంటి దారుణాలు తగ్గుముఖం పడుతాయి.
- కొలిపాక శ్రీనివాస్, పెద్ద సముద్రాల, హుస్నాబాద్

86
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles