ప్రభుత్వరంగ సంస్థల నిర్వీర్యం అనుచితం

Wed,July 10, 2019 01:02 AM

ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతున్నా యి. కానీ, మన దేశంలో మాత్రం అందుకు భిన్నంగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేవిధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుండటం దురదృష్టకరం. ఇది తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కున్న చందాన ఉన్నది. ప్రైవేట్ పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా ప్రవేశించడానికి వీలు కల్పిస్తూ ప్రైవేటీకరణకు మార్గాన్ని సుగ మం చేయటమే గాక, ప్రభుత్వరంగసంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణలపై ప్రభుత్వం వచ్చే ఐదేండ్లలో నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పర్చడం అనుచితం. ఇప్పటిదాకా ఖాయిలా పడ్డ పరిశ్రమలను మాత్రమే విక్రయించడం జరుగగా ఇకపై లాభాల బాటలో పయనించే సంస్థలను కూడా ప్రైవేట్‌పరం చేయబోతున్నారని తెలుస్తున్నది. విమానాశ్రయాల నిర్వహణ, ప్రభుత్వసంస్థల నుంచి ప్రభుత్వ వాటా ఉపసంహరణ, అన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతోనే స్థాపించడం, రైల్వేలు, బీమా, వైద్యరంగాల్లో ప్రైవేట్ సంస్థల ప్రవేశం వంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,05,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జమలను మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ లక్ష్యాన్ని ప్రభుత్వరంగ సంస్థల వ్యూహాత్మక విక్రయం ద్వారా సాధించాలని కేంద్రం లక్ష్యాలను నిర్దేశించుకోవడం అనుచితం. ఇది ఒక రకంగా స్వావలంబన కు తిలోదకాలవివ్వటంగా చెప్పవచ్చు. స్వతంత్ర భారతంలో స్వాతంత్య్రోద్యమ నాయకులు లాభార్జన పక్కనపెట్టి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారు. దాదాపు గా అన్నిరంగాల్లో ప్రభుత్వరంగ సంస్థలను నెలకొల్పారు. వీటి స్థాపన ఉద్దేశం అర్ధ చేసుకోకుండా కేవలం ఉత్పాదకత, లాభార్జనలను దృష్టిలో ఉంచుకొని ఈ సంస్థలను ప్రైవేట్‌పరం చేయడం సముచితం కాదు. అదేవిధంగా రైల్వేల ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా అనుసరించనున్నట్లు తెలుస్తున్నది. ప్రభుత్వరంగసంస్థల ప్రయివేటీకరణకు మోదీ సర్కారు ప్రయత్నాలను అన్ని ప్రతిపక్షరాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ప్రతిఘటించి తిప్పికొట్టాలి?.
- సి.సాయిప్రతాప్, రాహుల్‌కాలనీ, ఎ.ఎస్‌రావునగర్

110
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles