మీ బానిస చరిత్రను కూల్చొద్దా..?

Tue,July 9, 2019 01:29 AM

పరాయిపాలకుల పంచలు పట్టుకొని
అరవయ్యేండ్లు తిరిగిన మీ బానిస చరిత్రలను
ఇంకా పలవరించండి
తెలంగాణ ప్రజలను బానిసలుగా మార్చిన
పరాయి పాలకుల కుర్చీవాసనలు ఆస్వాదించండి
మీ జీవితకాలపు ఆత్మన్యూనతా దృశ్యాలను
ఆ పురాతన బంగలాల గోడలమీద దర్శించండి
బానిస గోడలకు గోడకుర్చీలు వేసే మీ మొకాలకు
నవ సమాజ నిర్మాణం ఆలోచనలు వస్తయా..!
మీ ఆత్మగౌరవాన్ని కోల్పోయిన దుర్బలత్వం
ఇంకా తెలంగాణ మీద రుద్దే అత్యుత్సాహం ఇకపై సాగదు
ఇప్పుడు తెలంగాణ స్వయంపాలిత
మీ బానిస నాయకత్వాన్ని అందికే మట్టిగరిపించింది
రేపటి తెలంగాణ నూతనోత్తేజంతో
ఉద్యమకాలం నాటి పోరాట పటిమతో
తనను తాను పునర్నిర్వచించుకుంటున్నది

నాటి ఉద్యమ పోరాటం నుంచీ నేటి పాలన వరకు
నాటి తెలంగాణ తల్లి రూపకల్పన నుండీ
నేటి అసెంబ్లీ భవన నిర్మాణం వరకూ
సీఎం కేసీఆర్ నిర్ణయాలే
తెలంగాణకు బంగారు బాటలుగా మారుతున్నయి
కూల్చివేస్తున్నది కట్టడాలను కాదు
మీ బానిస ఆలోచనలను
మీ నక్కజిత్తుల స్వార్థ రాజకీయాలను
ముఖ్యమంత్రి చేస్తున్నది
కొత్త భవనం కట్టడం కాదు
స్వపరిపాలనా, స్వాభిమాన చిహ్నాలను నిర్మించడం
నవ తెలంగాణ నిర్మాణానికి నాంది పలుకడం..
-హజారి

132
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles