దళిత వైతాళికుడు జగ్జీవన్‌రామ్

Sat,July 6, 2019 12:47 AM

Jagjeevan-Ram
నవభారత నిర్మాణానికి నాంది పలికిన అగ్రశ్రేణి జాతీ య నాయకుల్లో డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ ఒకరు. పిన్న వయస్సులోనే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని జైలు కెళ్లిన నాయకుడు. కులరహిత సమాజం కోసం అహర్నిశలు కృషిచేసిన నేత. సంక్షేమ రాజ్య స్థాపనకు నాంది పలికిన సంస్కర్త. బడుగు, అట్టడుగు వర్గాల ప్రజల ఆశాదీపం జగ్జీవన్ రామ్. ఆయన 1908 ఏప్రిల్ 5న బీహార్ రాష్ట్రంలోని షాబాద్ జిల్లా చాంద్వా గ్రామం లో బసంత్ దేవి-శోభిరామ్ పుణ్య దంపతు లకు జన్మించాడు. చదువుకునే రోజుల్లోనే అంట రానితనం దుష్ప్రభావాలను చవిచూశాడు. ఆ పరిస్థి తులే జగ్జీవన్‌రామ్ దేశంలోనే అత్యున్నత పదవులను అధి రోహించడానికి కారణమయ్యాయి.

1935లో ఆయన 27 ఏండ్ల వయస్సులో బీహార్ శాస నమండలి సభ్యునిగా ఎన్నిక కావడంతో ఆయన రాజకీ య ప్రస్థానం మొదలైంది. జగ్జీవన్‌రామ్ చరిత్రను మూడు దశలుగా విభజించి చూస్తేగానీ పూర్తిగా ఆయనను అర్థం చేసుకోలేం. 1.స్వాతంత్య్ర పోరాటంలో జాతీయస్థాయి లో అగ్రశ్రేణి నాయకుల్లో ఒకడిగా పోరాటం చేయటం. 2.భారత రాజ్యాంగ రచన డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యునిగా ఉండటం. 3.ఐదు దశాబ్దాల రాజకీయాల్లో ఓటమెరుగని నేత. మూడు దశాబ్దాల కాలం పాటు కేంద్ర కేబినెట్ మం త్రిగా, ఉప ప్రధానమంత్రిగా దేశ సమగ్రాభివృద్ధికి ఎనలేని సేవలందించడం వంటి ప్రధాన దశ లను పరికించి చూస్తేగానీ ఆయన చరిత్ర అవగతం కాదు.

ఎస్సీ రిజర్వేషన్లు పదేండ్ల అమలు తర్వాత రిజర్వేషన్లు ఉండాలా? వద్దా? అన్న అంశం పార్లమెంట్‌లో చర్చకు వచ్చి న సందర్భంలో ఈ దేశంలో కులపీడన, దోపిడీ, అణిచివేతలు కొనసాగినంత కాలం రిజర్వేషన్లు ఉండాల్సిందేనని పట్టుబట్టి చట్ట సవర ణ చేయించిన దళిత జాతి వైతాళికుడు. ఆయన 78 ఏండ్ల వయస్సులో 1986 జూలై 6న స్వర్గస్తులైనారు. ఆ మహ నీయుని జీవితం వర్థమాన చరిత్రకారులు పునికిపుచ్చు కున్నప్పుడే ఆయనకు సరైన నివాళి.
- డప్పోళ్ల రమేష్
(నేడు బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి)

113
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles