క్రికెట్ వీరుడు పల్వంకర్ బాలు

Fri,July 5, 2019 05:28 AM

Palwankar_Baloo
భారతదేశ క్రికెట్ చరిత్రలో అత్యంత వివక్షకు గురైన క్రికెటర్లలో మొదటివాడు బాలు పల్వంకర్. తర్వాతి స్థానంలో వినోద్ కాంబ్లీ, అతుల్ బెడాదేను కూడా చేర్చవచ్చు. ప్రస్తుతం 12వ ప్రపంచకప్ జరుగు తున్న నేపథ్యంలో మొదటితరం దళిత క్రికెట ర్ బాలు పల్వంకర్ గురించి చర్చించు కోవా ల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. భారతదేశ చరిత్రలో మరుగునపడిన చాలామంది దళి త యోధుల్లో ఈయన ఒకరు. డయ్యర్‌ను చంపిన చమార్ వీరుడు ఉద్దంసింగ్, ఝాన్సీ లక్ష్మీభాయి తరఫున తొలి స్వాతంత్య్ర సమరం లో పాల్గొన్న ఝల్కరీబాయి, సచిన్ మరు గునపడిపోయిన వినోద్ కాంబ్లీ... ఇలా ఎందరో దళిత యోధులున్నారు. బ్రిటిష్ ఇండియా ముంబై, ద్వారాడ్ మురికివాడలో 1876 మార్చి 19న చమార్(మాదిగ) కుటుంబంలో జన్మించారు పల్వంకర్. వీరి కుటుంబానిది చెప్పులు కుట్టే వృత్తి. ఆయనకు చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే ఇష్టం. మొదట హిందూ, ఆ తర్వాత భారతజట్టుకు వెన్నెముకగా నిలిచాడు. పల్వంకర్ ఎడమచేతి వాటం స్పిన్నర్. అయినా బంతిని ఇరువైపులా తిప్పగల సామర్థ్యం అతనిది. తన మొదటి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ను 1906 ఫిబ్రవరి 8న ఆడారు. పల్వంకర్ 1905-21 వరకు 179 వికెట్లు తీశాడు.

పల్వంకర్‌ను అంటరానిగావాడిగా చూసేవా రు. కేవలం ఈ వివక్ష వల్లనే అతను క్రికెట్ నుంచి తొలిగించివేయబడినాడు. క్రికెట్ తర్వాత వివక్షపై పోరాటం చేశారు పల్వం కర్. ఆయన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో సన్నిహితంగా మెదిలేవాడు. అంబేద్కర్ తో కలిసి అణగారిన కులాల ఐక్యత కోసం పోరాటం చేశారు. పల్వంకర్‌ను డాక్టర్ బీఆ ర్ అంబేద్కర్ హీరో ఆఫ్ దళిత్‌గా ప్రశంసించే వారు. 2018లో హిందీలో పల్వంకర్ బయోపిక్ సినిమా కూడా వచ్చింది. భారత దేశం గర్వించదగ్గ మొద టి దళిత క్రికెటర్ బాలు పల్వంకర్ అనడంలో సందేహం లేదు.
(నేడు బాలు పల్వంకర్ వర్ధంతి)
- డాక్టర్ పిడమర్తి రవి
-ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు

132
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles