రెండడుగుల దూరంలో భారత్

Wed,July 3, 2019 11:30 PM

2019 క్రికెట్ ప్రపంచకప్‌లోని లీగ్ మ్యాచ్ ల్లో ఆరు విజయాలు, ఒక ఓటమితో ఇం కో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు సెమీస్‌కు చేరింది. ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌ను చేజిక్కించుకునేందుకు టీమిండియా మరో రెండడుగుల దూరం లో ఉన్నది. బలమైన జట్లే సెమీస్‌కు చేరు కుంటాయి. కాబట్టి భారత జట్టు వ్యూహా త్మకంగా వ్యవహరించాలి. లీగ్‌దశలో మిగి లిన ఇంకో మ్యాచ్ భారత్ శ్రీలంకతో తల పడనున్నది. ఆ ఒక్క మ్యాచ్ కూడా భారత్ గెలిచి ఆత్మవిశ్వాసంతో సెమీస్‌లో అడుగు పెట్టాలి. భారత జట్టు లీగ్ దశలో చేసిన పొరపాట్లను సవరించుకోవాల్సిన అవస రం ఎంతైనా ఉన్నది. ప్రత్యర్థుల బలాబలా లను అంచనా వేస్తూ సరైన ప్రణాళికలను రచించి కట్టడి చేయాలి.
- పుల్కం సంపత్, రాములపల్లె, జగిత్యాల

బోనాల పండుగ శుభాకాంక్షలు

తెలంగాణ చరిత్ర, సంప్రదాయంలో భాగమైన బోనాల పండుగ నేటితో ఆరంభం కానున్నది. అనాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆషాఢ మాసంలో బోనాల పండుగ జరుపుకుంటారు. అలాంటి బోనాల పండుగ ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురయింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం తొలి తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గురించి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నది. ఇది అభినందనీయం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు.
- బొల్లం రమాదేవి, అల్వాల్, హైదరాబాద్

మన సినిమాను ఆదరించాలె

రాష్ట్ర ఆవిర్భావం తర్వాతే తెలంగాణ జీవిక, తెలంగాణ తనం, తెలంగా ణ సోయి ఉన్న సినిమాలను నిర్మిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగా ణ భాషను ఒక హాస్యానికే వాడుకున్నారు. ఇప్పుడే అదే భాష కేంద్రంగా సినిమాలు నిర్మిస్తుండటం గర్వకారణం. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇలాంటి సినిమాలను ఆదరించాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే తెలం గాణ సోయి ఉన్న సినిమాలు విరివిగా వస్తాయి.
- అక్షరకుమార్, రాంనగర్, హైదరాబాద్

149
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles