తీరు మార్చుకోవాలె

Wed,July 3, 2019 01:05 AM

ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించడం కాంగ్రెస్ నాయకులకు అలవాటుగా మారింది. సచివాలయం భవనాన్ని కొత్తగా నిర్మించేందుకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేసిన వెంటనే కాం గ్రెస్ వ్యతిరేక గళాన్ని ఎత్తుకోవటం హాస్యా స్పదం.ఆ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఇదంతా కేవలం మీడియాలో కనపడేందుకే తప్పా వేరే ఉప యోగం లేదంటూ ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాల తీరులో మార్పు రావాలి. ప్రభుత్వం చేస్తు న్న అభివృద్ధి కార్యక్రమాలకు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలె. కానీ, అడ్డుకోవడం సమంజసం కాదనే విషయం తెలుసుకోవాలి.
- పులి వెంకటేశ్, హైదరాబాద్

సంరక్షణ బాధ్యత ప్రజలదే

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని హరితహారం ద్వారా కోట్లాది మొక్కలు నాటుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడుతలుగా జరిగిన ఈ కార్యక్రమం ఈ నెలలో 5 విడుత ద్వారా కోట్లాది మొక్కలు నాటనున్నది. గ్రామీణ యువత, ప్రజలతో పాటు పంచాయతీ సిబ్బంది కూడా మొక్కలకు నీరు పోస్తూ, మొక్కలను పశువులు మేయకుండా కంచె లు ఏర్పాటు చేయాలె. మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణ బాధ్య త ప్రజలు తీసుకోవాలి.
- నర్మాల మనీష్, లక్ష్మీనగర్, కరీంనగర్

అవగాహన కల్పించాలె

విద్యుత్ షాక్‌తో ఓ యువతి మృతిచెందిన వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వానలకు తడిసిన ఇనుప స్తంభాలు షాక్ ఇచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. కాబట్టి విద్యుత్ అధికారులు ఇనుప స్తంభాలున్నచోట సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలె. దీంతో పాటు ప్రజలకు విద్యుత్ ప్రమాదాల పట్ల అవగాహన కల్పించాలె. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలె.
- నారదాసు రాజేందర్, రామంతాపూర్, హైదరాబాద్

136
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles