కలిసికట్టుగా కృషి చేయాలె

Tue,July 2, 2019 02:00 AM

రాష్ట్రంలోని ప్రతిపక్షపార్టీలు అధికార పార్టీపై నిత్యం విమర్శలకే పరిమితం అవుతున్నాయి. అయితే రాష్ర్టాభివృద్ధి కోసం తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలన్న విషయాన్ని మాత్రం విస్మరించ డం శోచనీయం. రాష్ట్రంలోని సగం జిల్లాలకు సాగు నీరు, తాగునీరు అందిం చే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండు చేయా ల్సింది పోయి విమర్శలు చేయడం సరి కాదు. విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ఇది అధికార పార్టీ సమస్య అన్నట్టు ప్రతిపక్షాల వ్యవహారం ఉన్నది. ప్రభుత్వంపై కేవలం విమర్శలు మాత్రమే చేస్తామనే వైఖరి మారాలి. విభజన, పెండింగ్ సమస్యల పరిష్కా రం కోసం కలిసికట్టుగా కృషి చేయాలి.
-ఎ. కుమారస్వామి, హైదరాబాద్

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలె

రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు కేంద్రం అడ్డుకట్ట వేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ ధరలు తగ్గించడానికి తగిన చర్యలు చేపట్టకపోవడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజానీకంపై పెను భారం పడుతున్నది. అందరి వికాసం కోసం పనిచేస్తామని చెబుతున్న కేంద్రంలోని పెద్దలు ఈ ధరల విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా దీనిపై దృష్టి సారించాలి. పెరుగుతున్న పెట్రోల్, డీజిలు ధరలను తగ్గించడానికి కృషి చేయాలి.
-బి. వేణుగోపాల్, నల్గొండ

జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలె

ఇన్‌కం టాక్స్ కట్టే సీనియర్ సిటీజన్స్‌కు 70 ఏండ్లు దాటిన వారికీ పన్నులో 10 శాతం రాయితీ ఇవ్వాలి. అలాగే 80 ఏండ్లు దాటిన వారికి పన్నులో 15 శాతం ఇవ్వాలి. ఎందుకంటే నేడు వీరు కట్టే హెల్త్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం చాలా ఎక్కువ. కాబట్టి వీరికి ఇన్స్యూరెన్స్‌కి, వైద్యానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఆర్థికమంత్రి ఈ వెసులుబాటు రాబోయే బడ్జెట్‌లో కల్పించాలి..
-చామర్తి వెంకట రామకృష్ణ ,హైదరాబాద్

126
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles