పసలేని ప్రసంగం

Sat,June 29, 2019 12:31 AM

ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ చేసిన మోదీ ప్రసంగం శ్రోతలను, వీక్షకులను పెద్దగా అలరించలేదనే చెప్పాలి. మోదీ ఎంతసేపు కాంగ్రెస్‌ను, విమర్శించడమే తప్పా రెండోసారి అఖండ మెజారిటీతో గెలిచిన తమ పార్టీ ప్రజల కోసం ఏం చేస్తుందో చెప్పలేకపోయారు. అప్పుడెప్పు డో ఇందిరాగాంధీ కాలంలో జరిగిన ఎమ ర్జెన్సీ గురించి ప్రస్తావించారే తప్పా దేశ వ్యాప్తంగా జరుగుతున్న హిందుత్వ దాడు లు, మూకదాడుల గురించి ఎక్కడా ప్రస్తా వించలేదు. గో మాంసం తింటున్న వారిపై దాడులు, మూకదాడులు జరుపుతున్న వారి గురించి ఎక్కడా చెప్పలేదు. ముందు గా మోదీ రానున్న ఐదేండ్లలో దేశం కోసం ఏం చేస్తాడో చెప్పాలి.
- కొలిపాక శ్రీనివాస్, సముద్రాల, హుస్నాబాద్

స్నేహపూరిత వాతావరణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఐదేండ్ల తర్వాత ఇరు రాష్ర్టాల మధ్య స్నేహ పూరిత వాతావరణం నెలకొనటం ఆహ్వానించదగిన పరిణామం. హైదరాబాద్‌లోని ఏపీ భవనాల అప్పగింత మొదలు, నీళ్ల వాటా దాకా ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చలు జరుపుతున్నారు. దీం తో రెండు రాష్ర్టాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకముందు కూడా ఇలాంటి వాతావరణమే కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నా రు. ఇద్దరు సీఎంలు ఆ దిశగానే ప్రయాణించాలి.
-పి.సంపత్, రాములపల్లి, జగిత్యాల

మండుతున్న కూరగాయల ధరలు

నగరంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సామాన్య ప్రజలు కూరగాయలు కొనలేని పరిస్థితి ఏర్పడుతున్నది. వంద రూపాయలు పట్టుకొని మార్కెట్‌కు వెళ్తే కనీసం కిలో కూరగాయలు కూడా రావటం లేదని ప్రజలు వాపోతున్నారు. నగర శివారు ప్రాంతాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించటమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా కూడా కూరగాయల పంట సాగుకు తగిన ప్రోత్సాహం అందించాలి.
- బుర్ర రాఘవేంద్ర గౌడ్, అంబర్‌పేట్, హైదరాబాద్

139
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles