ఆదర్శంగా నిలువాలె

Sat,June 8, 2019 01:13 AM

రాష్ట్రంలో గత ఆర్నెళ్లుగా ఎన్నికలే జరిగా యి. అసెంబ్లీ నుంచి మొదలు మొన్నటి, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల దాకా రాష్ట్రంలో హడావిడి కొనసాగింది. ఎన్ని కల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలయ్యింది. దీంతో ఎక్కడిక్కడ అభి వృద్ధి పనులు స్తంభించిపోయాయి. ఇప్పు డు రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. అయి తే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూడా లేదు. కాబట్టి అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అసెంబ్లీ నుంచి మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల దాకా ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యల ను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తూ ఆదర్శంగా నిలువాలె.
- కొలిపాక శ్రీనివాస్, సముద్రాల, హుస్నాబాద్

కఠినంగా వ్యవహరించాలె

జీవనోపాధి కోసం తెలంగాణ యువత గల్ఫ్ దేశాలకు వలస పోతున్నది. అయితే నకిలీ ఏజెంట్ల బారిన పడిన ఎందరో అభాగ్యులు మోసపోతు న్నారు. ఒక పని విషయంలో ఒప్పందం కుదుర్చుకొని తీరా అక్కడికి వెళ్లినాక గొర్లు, ఒంటెలు కాసే పనులను చూపించారంటూ ఇటీవల ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వెలుగు చూసింది. కాబట్టి రాష్ట్ర ప్రభు త్వం నకిలీ ఏజెంట్ల పట్ల కఠినంగా వ్యవహరించాలి. మోసపోయిన యువకులకు ప్రభుత్వం రక్షణగా ఉండాలి.
- పుల్కం సంపత్‌కుమార్, రాములపల్లె, పెగడపల్లి, జగిత్యాల

అభినందనీయం

నమస్తే తెలంగాణ పత్రిక ధర్మగంట శీర్షికన రెవెన్యూ అధికారుల లీలల ను ఒక్కొక్కటిగా వెలుగు చూపిస్తున్నది. కొందరు అధికారుల ఆగడాలను చూస్తుంటే విస్తుపోవాల్సిన పరిస్థితి దాపురిస్తున్నది. నమస్తే తెలంగాణ పత్రిక ఇలా బాధితుల పక్షాన ఉంటూ రెవెన్యూ సమస్యలను పూర్తిస్థా యిలో పరిష్కరిస్తుండటం అభినందనీయం. అధికారులు ఇకనైనా ప్రజలకు పారదర్శక పాలన అందించాలి.
- నారదాసు రాజేందర్, ఉప్పల్, హైదరాబాద్

188
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles