మసకబారిపోతున్న బాల్యం

Thu,June 6, 2019 01:10 AM

భారతదేశ విద్యావ్యవస్థ లోపభూయిష్టంగా మారింది, తక్షణం విద్యా వ్యవస్థలో ప్రక్షాళన, పరీక్షా విధానంలో మార్పులు అవసరం అని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 2001లోనే అన్నారు. కానీ నేడు లోపభూయి ష్టంగా విద్యావిధానం, పరీక్షల నిర్వహణ వల్ల విద్యార్థుల బాల్యం మసకబారిపోతున్నది. ఈ తరుణంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తక్షణ చర్యలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. లోపాల వల్ల విద్యార్థుల్లో ఆత్మగౌవరం స్థానంలో ఆత్మ న్యూనతా భావం ఎక్కువవుతున్నదనిపిస్తున్నది. ఆత్మవి శ్వాసానికి బదులు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఆత్మ సంయమనం స్థానంలో క్షణికావేశాలు పేట్రేగిపోతున్నా యి. లోపాల వల్ల విద్య ఉద్దేశాలన్నీ మసకబారిపో తున్నాయి. విద్యార్థులను నైతికంగా ఉన్నతులుగా తీర్చిది ద్దాల్సిన వ్యవస్థ కేవలం ఉద్యోగులను తయారుచేసే కర్మా గారాలు గా తయారయ్యాయి. గత దశాబ్దకాలం నుంచి విద్యారం గంలో నైతిక విలువలు, మానవీయ విలువలు పతనమ య్యాయనడంలో సందేహం లేదు. విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వానికి దోహదపడే నాలుగు పద్ధతులు నైపుణ్యాలు, మానవీయ విలువలు, శారీరక వ్యాయామం జ్ఞానాన్ని అందించడం ఒకప్పుడు ఉండేవి.

కానీ నేడు అందుకు భిన్నంగా కేవలం ఉద్యోగానికి అవస రమయ్యే ఆర్థికాభివృద్ధికి సహాయపడే నైపుణ్యాల ద్వారా నే నేడు జ్ఞాన సముపార్జన విద్యార్థులకు అందుతున్నది. విద్యలో నైతిక విలువల గురించి 1948 రాధాకృష్ణన్ కమిటీ, 1965 కొఠారీ కమిటీలు చెప్పినప్పటికీ పాలుకు లు, అధికారులు వాటిని విస్మరించారు. దీంతో విద్యా వ్యవస్థలో స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం కనిపించకుండా పోయాయి. ఉన్నత విద్యలో మానవీయ కోణం స్పృషిం చాలని సూచించినప్పటికీ అవి ఆచరణలో, అమలులో విఫలమవ్వటం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మనం భూమి విలువను ఎలా అంచనా వేస్తామో అలాగే విద్యా విలువను అంచనా వేస్తాం. ఎక్కువ సంపా దన తెచ్చే విద్య కావాలనుకుంటాం. నేడు తల్లిదండ్రులు విద్యార్థుల శీల నిర్మాణం, నడవడిని మెరుగుపర్చే విద్య గురించి అసలు ఆలోచించడం లేదు. అందుకే మొదట తల్లిదండ్రుల్లో మార్పు వస్తేనే విద్యా సమాజం ఆరోగ్యవం తమైన సమాజంగా, ఆత్మహత్యలు లేని సమాజంగా మార్పు చెందుతుంది.
- ఎం.ఎన్.విజయకుమార్, ఉపాధ్యాయులు

231
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles