ముదావహం

Tue,June 4, 2019 12:18 AM

ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లో పాలన కోసం ఏపీ ప్రభుత్వానికి తెలంగాణలో భవనాలు కేటాయించారు. అయితే కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం తమ పాలనా వ్యవహారాలన్నీ అమరావతి నుంచే కొనసాగిస్తున్నది. దీంతో ఇక్కడ ఖాళీగా ఉన్న భవనాల ను తమకు అప్పగించాలని తెలంగాణ మంత్రుల బృం దం గత ఏపీ టీడీపీ ప్రభుత్వాన్ని కోరింది. కానీ దీనిపై చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదు. కానీ విభజన సమస్యలపై కొత్తగా ఏపీ ముఖ్యమంత్రి అయిన జగన్మో హన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ల మధ్య జరిగిన చర్చల్లో ఇరువురి మధ్య సానుకూల వైఖరి వెల్లడైం ది. దీనికి కొనసాగింపుగానే ఏపీకి కేటాయించిన భవనాలను తెలంగాణకు అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇది మంచి పరిణామం. విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తామని ఎన్డీయే ప్రభుత్వం చెప్పిన మాటలు ఆచరణలో మాత్రం చూపెట్టలేదు. దీంతో గత టీడీపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టింది.

దీనిపై చొరవ తీసుకొని సమస్యలు పరిష్కరించాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం అనేకసార్లు కోరింది. అయినా అప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ భాగస్వామ్య పార్టీ కాబట్టి తెలంగాణ ప్రభు త్వ వినతులను నరేంద్ర మోదీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అయినా సహనంతో వ్యవహరిస్తూ తెలంగాణ ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్లింది. ఇప్పు డు విభజన సమస్యలను రాష్ర్టాల పరిధిలోనే పరిష్కరించుకుందామని ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసిం హన్ సమక్షంలో జరిగిన చర్చలో ప్రస్తావించారు. దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించడమే కాదు, అందుకు అనుగుణంగా నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇరు రాష్ర్టాల మధ్య ఇలాంటి స్నేహపూర్వక వాతావరణం ఉండాలని ఇరుప్రాంతాల ప్రజల కోరిక. ఈ దిశగా రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ముందడుగు వేయడం ముదావ హం. ఈ మైత్రి ఇలాగే కొనసాగాలి.
- బి. వేణుగోపాల్, హైదరాబాద్

136
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles