సంతోష దిశ

Sat,June 1, 2019 12:22 AM

తెలగాణం భారతాన
నేల కమ్మతావి కూన
భారతాన తెలగాణం
వీరగతుల నర గానం
భరతమాత పురాహృదయ
చరితలోన వికృతించిన
వివిధ జాతి దురహంకృతి
విరగ మోసినట్టి కోన
ఎంత అగ్గి రగిలిననూ
ఎదలో తడి ఆరిపోదు
ఎంత గరిమ కలిగిననూ
ఎగిరి కాసు వెంటురుకదు
సమాజాన్ని కుటుంబంగ
సహజంగా తలచే మది
వ్యవహారపు దారులలో
వ్యాపారం తెరువనిదది
దీర్ఘోద్యమ ఫలనమైన
దివ్యోదయ తెలంగాణ
సుధీర సారథ్యంలో
స్వర్ణముద్ర లేస్తున్నది
సంకరమౌ విలువలతో
సంకటమైనాగానీ
సరికొత్త మెళుకువతో
సమతుల్యత నేస్తున్నది
ఇంటిలోన పక్కలోన
కొంటె విసము గల కొందరు
చేయు కుతంత్రాల చీల్చు
చూపుపదును పెంచాలిక!
జాగృతితో జనులందరు
సుగతిరతులు కావాలిక!
తెలంగాణ బిడ్డలుగా
తెలివి తెగువ రేపాలిక!

155
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles