ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి

Thu,May 30, 2019 11:24 PM

మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ దేశమంతా భారీ మెజారిటీ కట్టబెట్టింది. కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి. ప్రజలు మోదీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని అందరినీ కలుపుకుని ముందుకు పోవాలి. రాష్ర్టాలు బాగుంటేనే దేశం బాగుంటుందనే విషయాన్ని విస్మరించరాదు. ప్రధాని మోదీకి కూడా ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్నది. కాబట్టి రాష్ర్టాల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. అప్పుడే ప్రజలు ఇచ్చిన ఈ భారీ విజయానికి అర్థం ఉంటుంది. ఈ దిశగా మోదీ ప్రభుత్వం పనిచేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. సమా ఖ్య స్ఫూర్తిని నిలుపుతూ దేశాభివృద్ధికి ఆద ర్శంగా నిలుస్తారని ఆశిద్దాం.
-పి. లక్ష్మణ్, హైదరాబాద్

సుహృద్భావం నెలకొల్పాలి

ఏపీలో టీడీపీ ప్రభుత్వం తెలుగువాళ్లు అంతా ఒక్కటే అని చెప్పుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రం ఇబ్బందులకు గురిచేసే విధంగా వ్యవహరించేది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఒకటే మాట చెబుతూ వస్తున్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని. ఇరుగు పొరుగు రాష్ర్టాలతో సత్ససంబంధాలు నెలకొల్పాలి అన్న మాటలను ఆచరణలోనూ చూపెట్టారు. కాబట్టి ఏపీ కొత్త ప్రభుత్వం ఏపీ, తెలంగాణ రాష్ర్టాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనేలా వ్యవహరించాలి.
-బి. కుమారస్వామి, జనగామ

చర్యలు తీసుకోవాలి

ఎండను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులను పొడిగించింది. పిల్లలకు ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు. కానీ కొన్ని పాఠశాలలు, కళాశాలలు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాబట్టి విద్యాశాఖ దీనిపై సీరియస్‌గా దృష్టి సారించాలి. నిబంధనలకు ఉల్లంఘిం చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
-జి. రాజశేఖర్, రంగారెడ్డి

147
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles