రోగికి మాతృమూర్తి

Sat,May 11, 2019 12:39 AM

సాధారణంగా దవాఖాన అనగానే మనకు ముందు గా డాక్టరు గుర్తుకువస్తారు. వైద్యుడిని మనం ప్రాణదాతగా వర్ణిస్తాం. సకాలంలో రోగి కోలుకోవాలంటే వైద్యుడు చేసే ప్రయత్నంతో పాటు, అక్కడ పనిచేసే నర్సుల పాత్ర కూడా చాలా కీలకం. వైద్యుడు రోగా న్ని నిర్ధారించి అవసరమైన మందులు రోగికి ఇస్తా డు. కానీ క్షేత్రస్థాయిలో రోగి మానసికస్థితిని నర్సు లు మాత్రమే అంచనా వేయగలుగుతారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే రోగులు రోజులతరబడి దవా ఖానలో వైద్యసేవలు పొందాల్సిన అవసరం ఉం టుంది. అటువంటి సమయంలో నర్సుల పాత్ర మరింత కీలకం. మహిళలే నర్సులుగా ఉంటారు. కాబట్టి వారు ఓర్పుతో వ్యవహరిస్తారు. తమ సేవల తో రోగిలో ధైర్యాన్ని నింపుతారు. నర్సులు రోగులకు చేసే సేవలను గుర్తించి అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని 1953 నుంచే జరుపాలని ప్రయత్నాలు జరిగాయి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ చొరవతో 1965 నుంచి అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటున్నాం. 1974 నుంచి ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు నాంది పలికిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుతున్నారు. లేడీ విత్ ది లాం ప్‌గా పేరుపొందిన నైటింగేల్ 1820 మే 12న ఇట లీలో జన్మించారు. 1854లో క్రిమియన్ వార్ రావడంతో నైటింగేల్ టర్కీ వెళ్ళి అక్కడ సైనికులకు విశేష సేవలు అందించింది. లండన్‌లో ఆమె థామస్ దవాఖానలో నర్సింగ్ స్కూల్‌ను స్థాపించింది. నర్సింగ్ రంగంలోకి ప్రవేశించే మహిళలకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహించింది. నైటింగేల్ నోట్స్ ఆన్ నర్సింగ్ అనే పుస్తకాన్ని రచించింది. జీవితాంతం ప్రజాసేవకే అంకితమైన నైటింగేల్ 1910 ఆగస్టు 13న తుదిశ్వాస విడిచారు. ఆమెను ది ఫౌండర్ ఆఫ్ మోడరన్ నర్సింగ్ అని పిలుస్తారు.
- యం. రాంప్రదీప్
(రేపు నర్సుల దినోత్సవం సందర్భంగా..)

110
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles