ధర్మగంటకు జేజేలు

Thu,May 9, 2019 01:32 AM

రెవెన్యూ శాఖలో ఏండ్ల తరబడి జరుగుతు న్న అక్రమాలు ధర్మగంట ద్వారా బయ టపడుతున్నాయి. రెవెన్యూ శాఖలో ఎంతటి అవినీతి ఉన్నదో తేటతెల్లం అవుతున్న ది. రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీ తి, అక్రమాలను ఎండగట్టేందుకు నమస్తే తెలంగాణ పత్రిక ధర్మగంట శీర్షికను ప్రారంభించటం హర్షణీయం. ఈ శీర్షిక మొదలైనప్పటి నుంచి ఏండ్ల తరబడి పేరు కుపోయిన రెవెన్యూ సమస్యలకు పరిష్కా రం లభిస్తున్నది. తహసీల్దార్‌లు సమస్య ల్లో ఉన్న రైతులను కార్యాలయాలకు పిలి పించుకొని సమస్యలను పరిష్కరిస్తున్నా రు. ఈ ధర్మగంట ఇలా మోగుతూనే ఉం డాలి. అప్పుడే రెవెన్యూ శాఖలో అవినీతి అంతవుతుంది. రైతులకు ఆఫీసుల చుట్టూ తిరుగడం తప్పుతుంది.
- ఎడ్ల స్వామిరెడ్డి, లక్ష్మీపూర్, మానకొండూర్

మండుతున్న ఎండలు

రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలకు వడదెబ్బతో చాలామంది చనిపోతున్నారు. ఈ మరణాలను నివారించాలంటే కొన్ని చర్యలు తీసుకోవాలి. వడదెబ్బ నుంచి ఎలా ఉపశమనం పొందాలో ప్రజ లకు మార్గనిర్దేశనం చేయాలి. వడదెబ్బ వల్ల కలిగే ప్రమాదాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఇందుకోసం ప్రచార, ప్రసార సాధనాలను వినియోగిం చాలి. దీంతోపాటు పబ్లిక్ స్థలాల్లో, బస్సు, రైల్వే స్టేషన్లలో చలివేంద్రాల ను ఏర్పాటుచేయాలి. వేసవి కష్టాలను పారదోలాలి.
- జంపాల అంజయ్య, సామాజిక కార్యకర్త, భువనగిరి

బాబుకు ఓటమి భయం

కంప్యూటర్, టెక్నాలజీని ప్రజలకు అందుబాటులోకి తానే తెచ్చానని గొప్పలకు పోయే ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు వాటిపైనే అనుమా నాలు వ్యక్తంచేయటం ఆశ్చర్యం. వీవీ ప్యాట్ స్లిప్పులన్నీ లెక్కబెట్టాలం టూ కోర్టుకెక్కటం, మీడియాలో నానా యాగి చేయటం సిగ్గుచేటు. చం ద్రబాబు తీరు చూస్తుంటే ఆయనకు ఓటమి భయం పట్టుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నది.
- బందెల శ్రీనివాస్, కమాన్, కరీంనగర్

124
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles