జీవన ప్రమాణాలు పెంచేలా ఉండాలి

Wed,May 8, 2019 12:28 AM

ప్రజాస్వామ్యదేశంలో ప్రజల కనీస అవసరాలను సమకూర్చడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్నారు. లేకుంటే ప్రభుత్వా లు ఎన్నికల్లో ఓటమి రూపంలో తగిన మూల్యం చెల్లించ క తప్పదని అంబేద్కర్ పేర్కొన్నారు. ఇది అక్షరాల సత్యం. కాబట్టి రాజకీయపార్టీలు ఎన్నికల సమయంలో జనాకర్షణ హామీలు ఇవ్వడానికి పోటీ పడుతుంటాయి. గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరిస్తుంటాయి. ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అనేది కనీస నిత్యావసరాలు, వీటిని సమకూర్చడానికి ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపె డుతున్నాయి. కానీ ఆచరణలోకి వచ్చే లక్ష్యానికి చేరుకోవడంలో విఫలమవుతున్నాయి. అవినీతి, కుంభకోణాల రూపంలో ప్రజల సొమ్ము పక్కదారి పడుతున్నది. ఈ తరుణంలో సామాన్య మానవుని అభివృద్ధికి కేటాయింపు లు ఎండమావిగానే ఉన్నాయి. దేశం ఆర్థికాభివృద్ధి, తలసరి ఆదాయంలో పైపైకి దూసుకుపోతున్నది. కానీ పేదరి కం, దారిద్రం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అసమానతలు లాంటివి ఇంకా ప్రజానీకాన్ని వెంటాడుతుండటం శోచనీ యం. అంతేకాదు ఆహారం, విద్య, ఆరోగ్యానికి పెరుగుతు న్న జనాభాకు తగినట్లు కేటాయింపు ఉండటం లేదు.

ఈ తరుణంలో నేడు రాజకీయపార్టీలు తాత్కాలిక లబ్ధి కోణం లో కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టిసారించాలి. వారి కనీస ఆదాయం పెరిగేలా చూడాలి. ఆయా పార్టీలు ఇచ్చే హామీ లు ప్రజల సామాజిక, ఆర్థిక జీవితాల్లో మార్పు తీసుకువ చ్చే విధంగా ఉండాలి. ముఖ్యంగా నిరుద్యోగులకు ప్రభు త్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ కల్పన చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. నాణ్యమైన విద్య, ఆరోగ్యం, వ్యవసాయాభివృద్ధి కోసం కృషిచేయాలి. తద్వారా మానవ జీవన ప్రమాణాలను పెంచాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రభుత్వా లు ఆర్థిక కార్యకలాపాల ద్వారా ఆదాయం సృష్టించుకోవడానికి అవకాశం కల్పించాలి. అవినీతిని అంతమొందించి పారదర్శకతను పెంపొందించాలి. అప్పుడే అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి ఫలాలను పొందుతారు. తద్వారా సమ్మిళిత అభివృద్ధికి బాటలు పడుతాయి. అప్పుడే మానవాభివృద్ధి సూచికలో మన దేశం మెరుగైన స్థానంలో నిలుస్తుం ది. ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించాలి.
- సంపతి రమేష్ మహారాజ్, రాజన్న సిరిసిల్ల జిల్లా

122
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles