ఒక్కతాటిపై నిలబడాలి

Tue,May 7, 2019 01:07 AM

బీసీ కులాలు ఒక్కతాటిపై నిలబడాలి. అంద రూ కలిసి ఒకే మాటపై నిలబడితే ఏకంగా దేశంలోనే అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు. కులసంఘాల మీటింగులలో కొందరి మాటలు కోటలు దాటుతుంటాయి కానీ చేతలు మాత్రం శూన్యమనేది జగమెరిగిన సత్యం. అధికార దాహంతో తమను తామే అణిచివేసుకుంటు న్నారు. అన్నివర్గాల వారిని కలుపుకొని పోకుం టే ఐక్యత ఎట్లా సాధ్యమో వారికే తెలియాలి. చిన్నచిన్న సమస్యలు చినికిచినికి గాలిలా మారుతున్నాయి. మార్పు రానంతరవరకు బీసీ సంఘాలు అభివృద్ధి కావనేది సుస్పష్టం. కాబట్టి ఇకనైనా గతాన్ని మరిచిపోయి అణిచి వేత గుణాలు మానుకోవాలి. అందరూ మమే కమై అందరిలో ఒకరిగా ఉన్నప్పుడే గుర్తింపు లభిస్తుంది. అప్పుడే బీసీల్లో నాయకులు పుట్టు కొస్తారు. అధికారం చేజిక్కించుకుంటారు.
- బైరి జనార్దన్ ప్రగతినగర్, హైదరాబాద్

చర్చలతో ముందడుగు

సామాజిక కార్యకర్త, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే నక్సలైట్ల సమస్య పరిష్కారానికి మధ్యవర్తిగా వ్యవహరిస్తా నడం ముదావహం. నిజానికి నక్సల్స్ సమస్య ప్రాంతీయ సమ స్యే అయినా జటిలమైంది. తుపాకులతో ప్రాణ, ధన నష్టమే తప్పా లాభం లేదని తేటతెల్లమైంది. కాబట్టి చర్చలతో ముందడుగు వేస్తే సమస్య పరిష్కారమవుతుంది.
- వీర పూర్ణచందర్‌రావు, హైదరాబాద్

విద్యుత్ కోతల్లేవు

ఉమ్మడి రాష్ట్రంలో ఎండాకాలం వచ్చిందంటే చాలు ఉదయం రెం డు గంటలు, సాయంత్రం రెండు గంటలు పవర్ కట్ చేసిన విష యం అందరికీ తెలిసిందే. ఓ పక్క ఎండ వేడిమి, మరోపక్క తీవ్ర ఉక్కపోతతో రోజులో నాలుగు గంటలు కరెంటు లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్లం. అలాంటి పరిస్థితి నుంచి రోజంతా ఎలాంటి అంతరాయాలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేసేవిధంగా సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవ అభినందనీయం.
- తుర్లపాటి పరేష్ బాబు, ఈస్ట్ మారేడ్‌పల్లి, సికింద్రాబాద్

118
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles