కేబుల్ దోపిడీ

Fri,May 3, 2019 10:33 PM

రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ట్రాయ్ నిబంధనలు మారాయంటూ, మారిన నియమ నిబంధనలు ప్రజలకు అనుకూలమైనవిగా ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. గతంలో ఎక్కడైనా 200 రూపాయలకే అన్ని ఛానళ్లు వచ్చేవి. ఇప్పుడు కొన్ని పెయిడ్, మరికొన్ని అన్‌పెయిడ్ అని విభజించి ప్రజలకు మరింత చౌకగా ఛానళ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. కానీ ఇప్పుడు అనుకున్న ఛానళ్లు రావటం లేదు. మరోవైపు కనీసం 300 రూపాయలు వసూలు చేస్తున్నారు. అదేమంటే.. మారిన రేట్ల ప్రకారం వసూలు చేస్తున్నామని చెబుతున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో టీవీ సాధారణమై పోయింది. టీవీ లేని ఇళ్లు ఉండదంటే అతిశయోక్తి కాదు. కాబట్టి ప్రజల బలహీనతను, అవసరాన్ని ఆస రా చేసుకొని కేబుల్ ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించటాన్ని అరికట్టాలి. అన్ని ఛానళ్లు అందుబా టులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
- డి.శ్రీధరాచారి, సీతారాంబాగ్, హైదరాబాద్

ఇకనైనా గొప్పలు మానాలి

ఉమ్మడి రాష్ట్ర హయాంలో తెలంగాణ ప్రాంత ప్రాజెక్టుల నిర్మాణాల కోసం ఏనాడూ కాంగ్రెస్ నేతలు మాట్లాడలేదు. కాకపోగా సీమాంధ్రకు నీరు తరలించే ప్రాజెక్టులకే ఈ నేత లు హారతులు పట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఒక్కొక్క ప్రాజెక్టు పూర్తయి బీడు భూములకు నీరందుతున్న తీరుచూసి ఓర్వలేక ఆ ప్రాజెక్టుల కోసం తాము కూడా పోరాడామని చెప్పుకోవటం సిగ్గుచేటు. ప్రతి పక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షిస్తారు.
- బైరి జనార్దన్, ప్రగతినగర్, హైదరాబాద్

నీట్ పరీక్ష రోజు మరే పరీక్షలుండరాదు

ఈ విద్యాసంవత్సరం నిర్వహిస్తున్న నీట్ పరీక్ష రోజున ఇతర పరీక్షలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆయుష్ కాలేజీల్లో అదేరోజు పరీక్షలున్నాయి. కావున అధికారులు ఆలోచించి నీట్ పరీక్ష రోజున ఇతర పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులకు సహకరించాలి.
- జీడిపల్లి లింగారావు, రామకృష్ణకాలనీ, కరీంనగర్

191
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles