కిడ్నీ వ్యాధులపై చైతన్యం అవసరం


Thu,March 14, 2019 01:11 AM

దేశంలో ప్రధాన అవయవాల వ్యాధుల్లో కిడ్నీ వ్యాధి ఒకటి. దేశంలో కిడ్నీ వ్యాధులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగడానికి అనేక కారణాలున్నాయి. మన దేశంలో ఏటా 28 శాతం మంది పిల్లలు రెండున్నర కిలోల కంటే తక్కువ బరువుతో పుడుతున్నారు. వీరంతా కిడ్నీవ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. చిన్న వయస్సులో పోషకాహార సమస్యలు మూత్రపిండాల పెరుగుదలను నియంత్రిస్తా యి. మేనరికాలు, చిన్న వయసులో లేదా మరీ, పెద్ద వయసులో పిల్లలను కనడం వంటివి కూడా కిడ్నీ సం బంధిత అవయవాల లోపాలతో పుట్టి తర్వాత కిడ్నీ జబ్బుల కు గురయ్యే అవకాశం పెరుగుతుంది. పేదరికం, పారిశుధ్య లోపం, వాయు కాలుష్యాలు, నీటి కాలుష్యం, ఆహా రంలో కల్తీలు, కొన్ని భారీ ఖనిజాలు మూత్రపిండ వ్యాధులకు దారి తీయవచ్చు.


కిడ్నీ వ్యాధులకు ప్రాథమిక దశలో ఎటువంటి లక్షణా లు ఉండకపోవడం, యాభై శాతానికిపైగా కిడ్నీ వ్యాధిగ్రస్థులు చివరిదశలో మాత్రమే డాక్టర్‌ను సంప్రదించడం మరికొన్ని కారణాలు. ఇది దేశంలో బలమైన స్క్రీనింగ్ కేంద్రాల ఆవశ్యకతను నొక్కిచెబుతున్నాయి. దేశంలోని 1.3 బిలియన్ల జనాభాకు కేవలం 1800 మంది కిడ్నీ స్పెషలిస్టులున్నారు. వీరిలో అధిక శాతం నగరాల్లో కేంద్రీ కృతమై ఉండటంతో సాధారణ ప్రజలకు కిడ్నీ వ్యాధి చికి త్స అందుబాటులో ఉండటం లేదు. ఇది మరింత అర్ధంతర మరణాలకు కారణం అవుతున్నది. తొంభై శాతం రోగులు డయాలిసిస్ తీసుకునేస్థాయిలో డాక్టర్‌ను సంప్ర దిస్తున్న స్థితి ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండ వ్యాధుల వల్ల ఏటా కనీసం 2.4 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయి. ప్రజలు వ్యక్తిగత ఆరోగ్యం పట్ల జాగరూకత కలిగి ఉండేవిధంగా, జబ్బులను నివారించే దిశగా అనేక పథకాలను ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ దవాఖానల్లో ఉచిత డయాలసిస్ సౌకర్యం కల్పించి మేలు చేస్తున్నది. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి అలవాట్లను గురించిన అంశాల పట్ల చైతన్యం కలిగించవలసిన అవస రం ప్రభుత్వాలు, సామాజిక శాస్త్రవేత్తల మీద ఉన్నది.
- డాక్టర్ శ్రీభూషణ్ రాజు
(నెఫ్రాలజీ విభాగాధిపతి, నిమ్స్ దవాఖాన, హైదరాబాద్)

542
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles