ఎన్నికలతో శాంతియుత పరివర్తన

Mon,March 11, 2019 11:15 PM

ఎన్నికలు అనేవి యుద్ధం కాదు. ప్రజా సమ్మతితో శాంతియుతంగా సాగే పరివర్తన. ప్రజల చేత ఎన్నుకోబడటం ద్వారా అధికారం అందుకోవటం. శాంతియుత పరివర్తనతో ప్రజాస్వామ్యంలో అధికారం మారుతుంది. ఎన్నికలనేవి ఒక శాంతియుత ప్రక్రియ. ఈ ప్రక్రియను యుద్ధంతో పోల్చడం, నగారా, యుద్దభేరి, వం టి పదాలతో ప్రేరేపించటం సరైనది కాదు. దేశాన్ని పాలించేందుకు ప్రజ లు ఎవరిని ఎన్నుకోవాలనే ప్రక్రియ లోక్‌సభ ఎన్నికలు. లోక్‌సభ అంటే లోకంలోని ప్రజల ఓట్ల ద్వారా ఎన్నుకునే పాలకుల సభ, ప్రతినిధుల సభ. ఓట్ల ద్వారా జన్మించే, మరణించే నాయకత్వాలు, పార్టీలు, అధికారంలోకి రావడం, దిగిపోవడం నిర్ణయ ప్రక్రియ. ఇది ఓటర్లు నిర్ణయిస్తారు. ఓటర్లు ఎన్నుకునే లోక్‌సభ ప్రతినిధుల ప్రక్రియను చీఫ్ ఎలక్ష న్ కమిషనర్ ఆదివారం ప్రకటించారు. చాలా విచిత్రమైన, విషాదకరమైన విషయమేమంటే, ఎన్నికల కమిషన్ ప్రకటించిన లక్ష్యాలకు, రాజ్యాంగ మౌలికసూత్రాలకు భిన్నంగా పత్రికలు, మీడియా ప్రచారానికి లంకించుకున్నయి. మీడియా ఓటర్లను వదిలివేసి పార్టీలను, నాయకులను ప్రధానం చేసి యుద్ధం మొదలైందని, నగారా మోగిందని, రాచరికాల కాలం నాటి పద బంధాలతో ఆవేశకావేశాలను రెచ్చగొ ట్టే ప్రక్రియతో విజృంభించింది. ఇదేం పద్ధతి? ప్రజలు ఎన్నుకోవాల్సిన ప్రతినిధుల ప్రక్రియ ప్రజలు మౌలికంగా, ప్రజల ప్రాధాన్యాన్ని ముందు కుతేవాలి. కానీ జరుగుతున్నదేమిటి? ప్రజలను లక్ష్యంగా కాకుండా, ప్రజల కోసం రాబోయే ఐదేండ్లలో చేపట్టాల్సిన కర్తవ్యాలను ప్రాథమికం చేయకుండా, వాటిని లక్ష్యంగా మార్చకుండా ఆయా నాయకులు, పార్టీలను లక్ష్యంగా ప్రధానం చేసి మీడియా సంచరిస్తున్నది.తెలంగాణలో, ఆంధ్రాలో వలసవాదుల ప్రచారం ఊపందుకున్నది. వలసవాదం భౌతికంగా పోయినా, చాపకింద నీరులా దాగి ఉన్నా, భావజాల ప్రచారం మాత్రం నిత్యం కొనసాగుతూనే ఉన్నది. పత్రికల్లో, మీడియాలో, సినిమాలో, రోజువారీ ప్రసంగాల్లో ఈ విషం చిమ్మబడుతూనే ఉన్నది. ఇండియా, పాకిస్థాన్ యుద్ధం వలె ద్వేషం రెచ్చగొట్టడం వల్ల కొందరు గెలువడం కోసం అదేపనిగా వాగాడంబరం ప్రదర్శిస్తున్నారు.


నిజానికి ఏం రాయాలి? ఎలా రాయాలి? నూతన పరిపాలకులను, ప్రజాప్రతినిధులను ప్రజలు ఎన్నుకునే ప్రక్రియ మొదలైందని రాయాలి. ఈ సందర్భంగా ప్రజల చేత ఎన్నిక కావాలని ఎంతోమంది ఉవ్విళ్ళూరుతున్నారు, ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్ల హృదయాల ను గెలుచుకొని, వారి అనుమతి ఓట్ల రూపంలో పొందే కృషిచేయాలి. ఇవి వెనుకటి యుద్ధాలు కావు: వెనుకటి యుద్ధాల్లో చంపేవాళ్లు, చచ్చేవాళ్లు. వ్యాసుడు కూడా కృష్ణుడి నోటి నుంచి చంపేదెవరు, చచ్చేదెవరు? అంతా నేనే చంపు, రాజ్యం వస్తుంది, చస్తే స్వర్గం వస్తుందని పలికించా డు. ఆ కాలం పోయింది. చంపడం లేదు, చావడంలేదు. ఇవి యుద్ధాలు కావు. ఓడిపోయినా బతికే ఉంటూ, తిరిగి ఎన్నికల్లో గెలువవచ్చు. పూర్వకాలంలో రాజును ఎన్నుకోవడానికి ఏనుగు పూలదండ తీసుకొని ఎవరి మెడలో వేస్తే వారు రాజు అని ప్రకటించేవారని చిన్నప్పుడు చందమామ, బాలమిత్ర కథల్లో చదువుకున్నాం. అలా ఏనుగులా ప్రజలు ఎవరినో ఒకరిని ఎన్నుకుంటారు. స్వయంవరంలో రాజు కుమార్తె ఎం తోమంది రాజులు వరుసలు కట్టి నిలబడితే ఎవరినో ఒకరిని వరిస్తుంది. అంతేగాని, మిగితా రాజులను చంపడం జరగదు. వలసవాద భావజాలాలు: ఇదిలా ఉంటే తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ర్టాల్లో ఒకేరోజు ఎన్నికలు నిర్ణయించడం చాలా మంచి పరిణామం. రెం డుచోట్ల ఓట్లు ఉన్నవారు ఎక్కడ ఓటు వేసుకోవాలో స్పష్టంగా నిర్ణయించుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణేతర భావజాలంతో మీడియా వీరవిహారం చేస్తున్న ది. గతంలో ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు దృష్టి మళ్లించడానికి ఒక రాజ ప్రతినిధి రాసలీలలు అంటూ ఎప్పుడో తీసినవి, ఆ సందర్భంగా ప్రచారం చేశారు. ఇలాంటి దొంగదెబ్బ ప్రక్రియలు తెలంగాణేత ర మీడియా నిత్యం చేస్తూనే ఉన్నది.సామ్రాజ్యవాదం, వలసవాదం, మాతృభూమి మీద యుద్ధం చేయదు. ఇరాన్ మీదో, ఇరాక్ మీదో, ఆఫ్ఘనిస్థాన్ మీదో యుద్ధం ప్రకటిస్తే వారి బాంబులు, వీరి బాంబులు మాతృభూమి మీదే పడుతుంటాయి. సామ్రాజ్య దేశాల్లో బాంబులు పడవు. వలసవాదాలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వక తప్పదు. ఈ మాట అనగానే మాతృభూమి మీద యుద్ధం మొదలవుతుందని సామ్రాజ్యవాదం బెంబేలెత్తిపోయింది.


ఇటీవల సర్వేల పేరిట సేకరించిన సమాచారం, ఓటర్ల సమాచారం గురించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటుచేసింది. అంతకుముందు అవినీతి, అక్రమ సంపాదనల గురించి ఆంధ్రాలో బినామీ ఆస్తుల గురించి, ఇన్‌కంటాక్స్, సీబీఐ దాడులు నిర్వహిస్తే, మాపైనే దాడులు చేస్తారా అంటూ ఒక రాష్ట్ర సీఈఓ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. అవినీతిని ఇంత బహిర్గతంగా లాలూప్రసాద్ యాదవ్ ఏనాడూ సమర్థించలేదు. చక్కగా జైలుకు కూడా పోయివచ్చి, ఆ తర్వాత తన ప్రజల చేత తిరిగి అభిమా నం పొందాడు. ఇది ప్రజల మధ్య, ప్రజల చేత ఎన్నుకోబడే నాయకుల లక్షణం. తెలంగాణలో, ఆంధ్రాలో వలసవాదుల ప్రచారం ఊపందుకున్నది. వలసవాదం భౌతికంగా పోయినా, చాపకింద నీరులా దాగి ఉన్నా, భావజాల ప్రచారం మాత్రం నిత్యం కొనసాగుతూనే ఉన్నది. పత్రికల్లో, మీడియాలో, సినిమాలో, రోజువారీ ప్రసంగాల్లో ఈ విషం చిమ్మబడుతూనే ఉన్నది. ఇండియా, పాకిస్థాన్ యుద్ధం వలె ద్వేషం రెచ్చగొట్టడం వల్ల కొందరు గెలువడం కోసం అదే పనిగా వాగాడంబరం ప్రదర్శిస్తున్నారు. గత అరువై ఏండ్లలో తెలంగాణ, ఆంధ్ర ప్రజలను, ప్రభుత్వాలను దోచి సంపన్నులైన కొందరు, కొన్ని సామాజిక వర్గాలు బరితెగించి ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాలు రెండు తెలుగు రాష్ర్టాలు అని వారే పేరుపెట్టి ఒక్కటే అని పైకిచెబుతూ, విద్వేషాలు పెంచుతున్నారు. రెండు తెలుగు రాష్ర్టాలు అనే పదం ఎందుకో నాకర్థం కావడం లేదు. ఒకటి ఆంధ్ర రాష్ట్రం, మరొకటి తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం అనే పేరు విస్తరణను నిరోధించడానికి తెలుగు రాష్ర్టాలని ప్రచారం మొదలుపెట్టారు. గతంలో నూటికి తొంభై సార్లు ఆంధ్రప్రదేశ్ అని పిలువకుండా, ఆంధ్ర, ఆంధ్ర రాష్ట్రం అని పిలిచినవాళ్లు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడగానే ఎందుకో విచిత్రంగా ఆంధ్రప్రదేశ్ అనే పిలుచుకుంటున్నారు.

వలసవాదం, సామ్రాజ్యవాదం పోయినా అటువంటి భావాలు కొనసాగుతూనే ఉంటాయి. రష్యాలో సోషలిజం పోయినా, సోషలిజం, నక్సలిజం, కమ్యూనిజం, మావోయిజం అంటూ ప్రచారాలు కొనసాగుతు న్నాయి. అలాగే రాచరికాలు పోయినా, భారత రాజ్యాంగం కుల, వర్ణ వివక్షలను నిషేధించినా వాటి ప్రచారం, సాహి త్యం, సంస్కృతి, సంప్రదాయ రూపాల్లో కొనసాగిస్తున్నారు. అలాగే సామ్రాజ్యవాదం, వలసవాదం, భావజాల ప్రచారం, వారి దృక్పథాలు, లక్ష్యాలు ఎప్పటికప్పుడు కొత్తవాటిని విశ్లేషించే రూపంలో ప్రభావితం చేస్తూనే ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. సామ్రాజ్యవాదం, మాతృభూమిపై యుద్ధం చేయదు: వలసవాదులు, సామ్రాజ్యవాదులు ఏజెంట్లను, సామంతులను తయారుచేసుకుంటారు. జోహుకుం, అర్ధ బానిసలను తయారుచేసుకుంటారు. ఢిల్లీకో, దౌల్తాబాద్‌కో, నాగపూర్‌కో, కోల్‌కతాకో, అమరావతికో వంగి, వంగి సలాంలు చేసే గులాంల నాయకత్వాన్ని బహు ప్రశంసలతో, ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలని ముందుకుతెస్తుంటారు. స్వీయ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, తన కాళ్లమీద తాను నిలబడుతున్న తెలంగాణ రాష్ట్రం, నేడు దేశానికి పలురంగాల్లో మార్గదర్శకంగా, ఆదర్శవంతంగా నిలిచింది. ఈ మార్గదర్శకాలను, విజయాలను ప్రశంసిస్తూ, మేం కూడా స్వీకరిస్తు న్నామని, ఆయా పార్టీలు తమ ప్రసంగాల్లో, ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటిస్తూ, వాటికి అదనంగా ఇంకా ఫలానా, ఫలానా చేస్తామని చెప్పుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉన్నది. తెలంగాణేతర మీడియా తెలంగాణలో కూడా బాగా ప్రచారంలో ఉన్నది. ప్రభావితం చేస్తున్నది. వారుచేసే విమర్శలు తెలంగాణ మేలు కోరి కాదు. దానివెనుక లక్ష్యాలు వేరు. వారి కి కొందరు తెలంగాణ వారు కూడా ఆయుధాలవుతున్నారు. విమర్శలు చేసేవారు ప్రశంసించలేరు. దాడిచేసే వారు మేలు కోరేవారు కాదు.
ramulu-bs
వలసవాదులు తెలంగాణలో తీవ్రంగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. దొంగ సర్వేలు నిర్వహించి ప్రభావితం చేశారు. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామనగానే తల్లడిల్లిపోతున్నారు. రిటర్న్‌గిఫ్ట్: సామ్రాజ్యవాదం, వలసవాదం, మాతృభూమి మీద యుద్ధం చేయదు. ఇరాన్ మీదో, ఇరాక్ మీదో, ఆఫ్ఘనిస్థాన్ మీదో యుద్ధం ప్రకటిస్తే వారి బాంబులు, వీరి బాంబులు మాతృభూమి మీదే పడుతుంటాయి. సామ్రాజ్య దేశాల్లో బాంబులు పడవు. వలసవాదాలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వక తప్పదు. ఈ మాట అనగానే మాతృభూమి మీద యుద్ధం మొదలవుతుందని సామ్రాజ్యవాదం బెంబేలెత్తిపోయింది. కొరి యా అధ్యక్షునితో అమెరికా అధ్యక్షుడు దిగివచ్చి చర్చలకు పూనుకున్నా డు. అలాగే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వక తప్పదనగానే ప్రపంచం తలకిందులైనట్టు తెలంగాణేతర నాయకత్వం బెంబేలెత్తిపోతున్నది. ఎన్ని మోసాలకో, కుట్రలకో పాల్పడుతున్నది. వాటన్నింటిని వెలికితీయడం, తిప్పికొట్టడం సామ్రాజ్యవాద, వలసవాద ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు వాస్తవాలను అందించి మోసపూరిత ప్రచారం నుంచి ప్రశాంత చిత్తంలోకి స్వయంగా తమకుతాము నిర్ణయించుకొని ప్రజాప్రతినిధులను ఎన్నుకు నే వాతావరణాన్ని ఏర్పరుచడం మనందరి కర్తవ్యం.
(వ్యాసకర్త: రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు)

457
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles